NTV Telugu Site icon

Summer Healtcare: నగరంలో పెరుగుతున్న ఉక్కపోత.. మూడ్రోజుల్లో మరింత ఎండలు

Summer Healtcare

Summer Healtcare

Summer Healtcare: రాష్ట్రంలో భానుడు భగభగ ఇంకా మూడ్రోజుల్లో మరింత పెరగనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రోజూ వారి ఉష్ణోగ్రతలు సాధారణంగా కంటే 5 డిగ్రీల వరకు పెరిగాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రగ ఎక్కవగా ఉంటుందని వెల్లడించింది. ఎండలు పెరుగుతున్న కారణంగా తెలుగు రాష్ర్టాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. హైదరాబాదలో దక్షిణాది నుంచి తెలంగాణ వైపునకు వీస్తున్న గాలుల ప్రభావంతో ఉక్కపోత పెరుగుతోందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ సాధారణం కన్నా ఒక డిగ్రీ అధికంగా నమోదు అవుతాయని పేర్కొంది. ఈనెల 28 నుంచి మూడ్రోజుల పాటు ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఇక రానున్న ఏప్రిల్‌ రెండో వారం నుంచి ఎండలు తీవ్రత మరింత పెంగుతుందని హెచ్చరికలు జారీ చేసింది.

Read also: China On Arunachal Pradesh: అరుణాచల్ ప్రదేశ్ పై మరోసారి విషం కక్కిన డ్రాగన్ దేశం..!

అంతేకాకుండా.. రాష్ట్రంలో ఎండలు పెరుగుతున్న కారణంగా ప్రజలు తగిన జాగ్రత్తల తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్న సమయాల్లో బయటకు రావద్దని తెలిపారు. ఒక వేళ మధ్యాహ్న సమయంలో బయటకు రావల్సి వస్తే.. మంచి నీరు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, ఓఆర్‌ఎస్‌ వంటివి తాగలని సూచించారు. శరీరానికి డీహైడ్రేషన్‌ సమస్య తలెత్తకుండా తరుచూ మంచి నీరు తాగాలని కోరారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ లోనూ ఎండలు విపరీతంగా పెరిగాయి. మార్చిలో అనంతపురంలో దేశంలోనే అత్యధికంగా 40.9 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయ్యింది. మార్చినెలలో ఎండ వేడి, ఉక్కపోత ఎక్కవగా కొనసాగుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక రానున్న 5రోజులు రాయలసీమతో పాటు పలు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతతలు నమోదవుతాయని ఐఎండీ హెచ్చరించింది. ప్రజలు ఎండల నుంచి అప్రమత్తంగా ఉండాలని కోరింది.
Allu Arjun: ఫ్యామిలీతో దుబాయ్ వెళ్లిన ఐకాన్ స్టార్.. ఎందుకంటే?