NTV Telugu Site icon

Blast: హైదరాబాద్‌ శివారులో పేలుడు, మహిళ మృతి

హైదరాబాద్‌ శివారులో పేలుడు కలకలం సృష్టించింది.. రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఆనంద్ నగర్‌లో చెత్త కుండీలో పేలుడు సంభవించింది… ఈ ఘటనలో ఓ మహిళ మృతిచెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా మారింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆనంద్‌ నగర్‌లో చెత్త సేకరించేందుకు రంగముని సుశీలమ్మ, ఆమె భర్త ఆనందనగర్ పారిశ్రామిక వాడలకు ఉదయం ఆటోలో వెళ్లారు.. అయితే, చెత్త సేకరిస్తున్నండగా పేలుడు జరిగింది.. ఈ ఘటనలో సుశీలమ్మ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా.. ఆమె భర్త రంగముని తీవ్రగాయాలపాలయ్యారు.

Read Also: COVID 19: భారత్‌లో భారీగా తగ్గిన కేసులు

పేలుడు సమయంలో పెద్దగా శబ్దం వచ్చిందని చెబుతున్నారు స్థానికంగా ఉండే ప్రజలు.. సుశీలమ్మ మృతదేహం ఘటన స్థలంలోనే పూర్తిగా చిందరవందరగా పడి ఉండటం స్థానికులను ఆశ్చర్యానికి గురయ్యారు.. నందనవనంలో ఉండే వీరు నిత్యం చెత్తాచెదారం సేకరించి జీవించేవారు.. పారిశ్రామికవాడలో వ్యర్థాలను సేకరించేందుకు ఆటోలో వచ్చారు.. రోడ్డుపై ఉన్న గ్రానైట్స్ రాళ్ల పక్కనే ఉన్న చెత్తను సేకరిస్తున్నండగా ఒక్కసారిగా పేలినట్టుగా చెబుతున్నారు.