Site icon NTV Telugu

K. Laxman: అవినీతి పరులను జైల్లో వేస్తామన్నారు.. సీఎం మాటలకే పరిమితమా..?

K.lakshman

K.lakshman

K. Laxman: రేవంత్ రెడ్డి అవినీతి పరులను జైల్లో వేస్తామని మాటలకే పరిమితం అయ్యాడు తప్ప చర్యలు లేవని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి లీక్ వీరుడు కాదు.. గ్రీక్ వీరుడు అని నిరూపించుకోవాలని అనుకుంటే ఫోన్ టాపింగ్ వ్యవహారం నీ సీబీఐ విచారణ జరపాలన్నారు. పాత్ర దారులతో పాటు సూత్ర దారులను కూడా బయట పెట్టాలన్నారు. కవిత లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యారు. పోన్ టాపింగ్ లో ఆ కుటుంబం పాత్ర ఉందన్నారు. కాళేశ్వరంలో కూడా ఆ కుటుంబం పాత్ర ఉందని ఆరోపణలు ఉన్నాయి… వారికి శిక్ష పడాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. రేవంత్ రెడ్డి అవినీతి పరులను జైల్లో వేస్తామని మాటలకే పరిమితం అయ్యాడు తప్ప చర్యలు లేవన్నారు. ధరణి పై చర్యలు లేవు.. ఒక్క దరఖాస్తును కూడా పరిస్కరించలేదన్నారు. మియాపూర్ భూములు, డ్రగ్స్ కేసులు పత్తా లేవన్నారు. తాజాగా పోన్ టాపింగ్ వ్యవహారం ..ప్రముఖుల పోన్ టాపింగ్ జరిగాయని ఆరోపణలు వస్తున్నాయన్నారు.

Read also: Yarlagadda VenkatRao: గన్నవరంలో “నిజం గెలవాలి” యాత్ర.. నారా భువనేశ్వరికి ఘన స్వాగతం పలికిన యార్లగడ్డ

ఒకరిద్దరు లంగాలు లుచ్చాలవి జరిగితే జరగొచ్చు అని కేటీఆర్ అంటున్నారని తెలిపారు. పోలీస్ అధికారులు మాత్రం ప్రభుత్వం చెపితేనే చేశామని అంటున్నారన్నారు. ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీలా ఉంది కాంగ్రెస్ , బీఆర్ఎస్ ల పరిస్థితి అంటూ మండిపడ్డారు. నియంతృత్వ పాలన చేసేవారు తమ నీడను కూడా తాము నమ్మరన్నారు. అందులో భాగమే పోన్ టాపింగ్ అన్నారు. ఫోన్ టాపింగ్ తో కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని తెలిపారు. పోన్ టాపింగ్ సామాన్యమైనదికాదన్నారు. కేంద్ర హోం శాఖ అనుమతి లేకుండా చేయకూడదన్నారు. పోలీస్ లు చట్టాన్ని అతిక్రమిస్తే కేటీఆర్ మీ ప్రభుత్వం గుడ్డి గాడిద పల్లు తోమారా? అని ప్రశ్నించారు.
Sundaram Master OTT : ఓటీటీలోకి వచ్చేసిన సుందరం మాస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Exit mobile version