NTV Telugu Site icon

BJP: జాతీయ కార్యవర్గ సమావేశాలు.. అజెండాలోని అంశాలు ఇవే..!

Modi Hyderabad

Modi Hyderabad

బీజేపీ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్ లో నిర్వహించబోతోంది. ఇప్పటికే హైదరాబాద్ లో వేదిక కూడా ఖరారు చేశారు. జూలై 2,3 తేదీల్లో కార్యవర్గ సమావేశాలు జరగబోతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు, పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సహా అగ్రనేతలందరూ హాజరుకానున్నారు. ఇప్పటికే కార్యక్రమం భారీ స్థాయిలో నిర్వహించాలని రాష్ట్ర బీజేపీ నేతలకు ఆదేశాలు అందాయి. వచ్చే ఎన్నికలను ప్రభావితం చేసేలా జనసమీకరణ ఉండాలని పార్టీ అదిష్టానం రాష్ట్ర నేతలకు దిశానిర్థేశం చేసింది.

2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దక్షిణాదిలో జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగడం ఇది మూడో సారి. ఐదేళ్ల తరువాత దేశ రాజధాని ఢిల్లీకి వెలుపల జరగుతున్న కార్యవర్గ సమావేశం ఇదే. దీంతో పాటు తెలంగాణ రాష్ట్రానికి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో తెలిపేలా బీజేపీ కార్యవర్గ సమావేశాలు ఉండబోతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా తెలంగాణలో అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ చూస్తోంది. దీంతో ఇటీవల వరసగా జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షా తెలంగాణకు వచ్చి టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇటీవల ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నిర్వహించిన కార్యక్రమం కోసం ప్రధాని మోదీ హైదరాబాద్ కు వచ్చారు. ఈ సమయంలో కేసీఆర్ కుటుంబ పాలనపై విమర్శలు గుప్పించారు.

ఇదిలా ఉంటే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఎజెండా ఫిక్స్ అయింది. జూలై 2, సాయంత్రం 4 గంటల నుంచి జూలై 3 సాయంత్రం 5 గంటల వరకు సమావేశాలు ముగియనున్నాయి. సమావేశాల్లో.. 1) త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల ప్రిపరేషన్, 2) గత కార్యవర్గ సమావేశాల నుండి ఇప్పటి వరకు జరిగిన పెద్ద కార్యక్రమాలు, 3) భవిష్యత్ కార్యచరణ, 4) పలు అంశాలపై తీర్మానాలు, 5) దేశంలోని తాజా పరిస్థితులు, 6) సంస్థాగత అంశాలు. ఎజెండాలోని అంశాలుగా ఉండనున్నాయి.