Site icon NTV Telugu

మూడో రోజు బండి సంజయ్‌ పాదయాత్ర.. సాగనుంది ఇలా..

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన ప్రజా సంగ్రామ యాత్ర మూడో రోజుకు చేరుకుంది.. చార్మినార్‌ భాగ్యలక్ష్మి టెంపుల్‌ నుంచి పాదయాత్రను ప్రారంభించిన ఆయన.. రెండో రోజు గోల్కొండ కోట దగ్గర బహిరంగసభ నిర్వహించారు.. 2023 ఎన్నికల్లో గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.. ఇక, ఇవాళ సంజయ్‌ పాదయాత్ర మూడో రోజుకు చేరుకోగా.. తిప్పుఖాన్ బ్రిడ్జి, లంగర్ హౌస్, ఆరే మైసమ్మ దర్శనం తర్వాత సభ నిర్వహించి లంచ్‌ బ్రేక్‌ ఇవ్వనున్నారు.. ఆ తర్వాత అజీజ్ నగర్ మీదుగా హిమాయత్‌నగర్‌ వరకు పాదయాత్ర సాగనుండా.. ఈ రోజు మొత్తంగా 13 కిలోమీట్ల మేర పాదయాత్ర నడుస్తారు.. హిమాయత్‌నగర్‌లో రాత్రి బస చేయనున్న బండి సంజయ్‌.. రాత్రి 9.30 గంటలకు మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు.

Exit mobile version