కేసీఆర్ అహంకారానికి వ్యతిరేకంగా ప్రజలు ఓటు వేస్తారు: తరుణ్‌చుగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుజురాబాద్‌లో ఎన్నికలు సమయం దగ్గర పడుతున్న కొద్ది పార్టీలు ప్రచార జోరును పెంచుతున్నాయి. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు మద్దతుగా మంగళవారం బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ తరుణ్ చుగ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన అధికార టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పిస్తూనే బీజేపీ ఈటల గెలిస్తే నియోజకవర్గానికి వచ్చే పనులను వివరించారు.
తరుణ్ చుగ్ మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబం హుజురాబాద్ ప్రజలను, రాష్ట్ర ప్రజలను అవమానించిందని, కుక్కను పెట్టినా గెలుస్తామని అన్నారన్నారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ అహంకారానికి వ్యతిరేకంగా ప్రజా తీర్పు ఉండబోతోందన్నవారు. రాజరిక, దోపిడీ, అవినీతి ప్రభుత్వాన్ని ఓడించాలని ప్రజలు నిర్ణయించుకున్నారని తెలిపారు.
Also Read
కాంగ్రెస్, టిఆర్ఎస్ల మధ్య లోపాయికారి ఒప్పందం నడుస్తుందని తరుణ్ చుగ్ వ్యాఖ్యానించారు. కాంట్రాక్టర్ లతో కుమ్మక్కు అయిన టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం ధనవంతుల కోసమే పని చేస్తుందన్నారు. ఈ ఎన్నికల్లో ఈటల గెలిస్తే హుజూరాబాద్ లో 60 రోజుల్లో రైల్వే అండర్ బ్రిడ్జ్ పూర్తి చేయడంతో పాటు గ్రామీణ సడక్ యోజన నిధులు తీసుకొస్తామని, హుజురాబాద్ అభివృద్ధికి సహకరిస్తామని తరుణ్ చుగ్ చెప్పారు.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్‌లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!