BJP: పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ దృష్టి సారించింది. అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం తర్వాత ప్రధాని మోదీ తెలంగాణకు రానున్నారు. తెలంగాణలో ఎన్నికల సభలు జరగనున్నాయి. ఉత్తర తెలంగాణలో ఒక సభ, దక్షిణ తెలంగాణలో మరో సభను బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఇవాళ బీజేపీ ముఖ్య నేతల కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కిషన్ రెడ్డి, సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, బండి సంజయ్, డీకే అరుణ, లక్ష్మణ్, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్ తదితరులు పాల్గొంటారు. కాగా.. నేతల మధ్య అంతరంపై బీజేపీ జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించనుంది. వారందరినీ సమన్వయం చేసే బాధ్యతను బీజేపీ సీనియర్ నేత అమిత్ షా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి అప్పగించారు. పార్లమెంటు ఎన్నికలకు అభ్యర్థులు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. 35 శాతం ఓట్లతో పాటు పది పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకోవాలని బీజేపీ యోచిస్తోంది. సంస్థాగతంగా, పార్టీలో చేరికలపై నేతలు చర్చించనున్నారు.
Read also: Uppal Crime: 16 ఏళ్ల బాలికపై 60 ఏళ్ల వృద్ధుడి అత్యాచారం.. లిప్ట్ ఇస్తానని ఘాతుకం
సంక్రాంతి తర్వాత కిషన్ రెడ్డి కొన్ని జిల్లాల అధ్యక్షులను మార్చాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ భేటీలో పార్టీ అంతర్గత అంశాలు, నేతల మధ్య సమన్వయం పై చర్చించనున్నారు. లోక్ సభ ఎన్నికలు సీటు ఆశిస్తున్న వారి పై కమిటీ చర్చ జరగనుంది. ఏకాభిప్రాయం ఉన్న స్థానాల్లో ముగ్గురితో కూడిన జాబితా సిద్దం చేసి కేంద్ర కమిటీ కి నేతలు పంపనున్నట్లు సమాచారం. పార్లమెంట్ పొలిటికల్ ఇంఛార్జి లు, ప్రభారి లు, కన్వీనర్ లతో సమావేశం అనంతరం.. పార్లమెంట్ ఎన్నికల రోడ్ మ్యాప్ ఖరారు చేసే అవకాశం ఉంది. అనంతరం ఈ రోజు బీజేపీ శాసన సభ పక్ష నేతను ఎన్నుకునే అవకాశం ఉంది.. రాజా సింగ్, మహేశ్వర్ రెడ్డి లలో ఒకరికి ఛాన్స్ దక్కే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.
Uppal Crime: 16 ఏళ్ల బాలికపై 60 ఏళ్ల వృద్ధుడి అత్యాచారం.. లిప్ట్ ఇస్తానని ఘాతుకం