Site icon NTV Telugu

Bandi Sanjay Kumar: ‘‘ఆ ఒక్కటీ అడక్కు’’ పోస్టర్లను విడుదల చేసిన బీజేపీ

Bjp1 (2)

Bjp1 (2)

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం తారస్థాయికి చేరింది. మునుగోడు సహా రాష్ట్రవ్యాప్తంగా సీఎం ఇచ్చిన హామీలను ఎద్దేవా చేస్తూ పోస్టర్లు రూపొందించింది బీజేపీ. సోషల్ మీడియా వేదికగా విస్త్రత ప్రచారం చేయాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఆ ఒక్కటీ అడక్కు అంటూ బండి సంజయ్ పోస్టర్లు విడుదల చేశారు. బీజేపీ సోషల్‌ మీడియా విభాగం వినూత్నంగా రూపొందించిన ‘‘ఆ ఒక్కటీ అడక్కు’’ పోస్టర్లను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌కుమార్‌, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ ఛార్జి తరుణ్ చుగ్ విడుదల చేశారు.

మునుగోడు నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి చంద్రశేఖర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జి.ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, జిల్లా అధ్యక్షులు కంకణాల శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి జె.సంగప్ప, కంకణాల నివేదితా రెడ్డి తదితరులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ 8 ఏండ్ల పాలనలోని ప్రజావ్యతిరేక విధానాలను, ఆయన ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడాన్ని ఎండగడుతూ సోషల్‌మీడియా విభాగం వినూత్నంగా, ప్రజలను ఆకర్షించేవిధంగా పోస్టర్లను రూపొందించడాన్ని ఆయన అభినందించారు. కేసీఆర్‌ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ రూపొందించిన ‘‘ఆ ఒక్కటీ అడక్కు’’ పోస్టర్లను సోషల్‌ మీడియా అన్నీ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని ఆయన కోరారు.

* చౌటుప్పల్‌లో డిగ్రీ కాలేజ్‌ కేసీఆర్‌ – ఆ ఒక్కటీ అడక్కు
* ఆకుపచ్చ మునుగోడును చేస్తా కేసీఆర్‌ – ఆ ఒక్కటీ అడక్కు
* రైతులకు ఉచిత ఎరువులు కేసీఆర్‌ – ఆ ఒక్కటీ అడక్కు
* రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ కేసీఆర్‌ – ఆ ఒక్కటీ అడక్కు
* దళిత ముఖ్యమంత్రి కేసీఆర్‌ – ఆ ఒక్కటీ అడక్కు
* ఇంటికో ఉద్యోగంకేసీఆర్‌ – ఆ ఒక్కటీ అడక్కు
* నిరుద్యోగభృతి కేసీఆర్‌ – ఆ ఒక్కటీ అడక్కు
* ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ కేసీఆర్‌ – ఆ ఒక్కటీ అడక్కు
* ఎంబీసీలకు ప్రతీ బడ్జెట్‌లో వెయ్యికోట్లు కేసీఆర్‌ – ఆ ఒక్కటీ అడక్కు
* దళిత, గిరిజనులకు కాంట్రాక్టు పనులు కేసీఆర్‌ – ఆ ఒక్కటీ అడక్కు
* కొత్త ఆసరా ఫించన్లు కేసీఆర్‌ – ఆ ఒక్కటీ అడక్కు
* మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు కేసీఆర్‌ – ఆ ఒక్కటీ అడక్కు
* ఉద్యమకారులకు రాజకీయ అవకాశాలు కేసీఆర్‌ – ఆ ఒక్కటీ అడక్కు
* బీసీలకు ఆత్మగౌరవ భవనాలు కేసీఆర్‌ – ఆ ఒక్కటీ అడక్కు
* ప్రతీ నియోజకవర్గానికి లక్ష ఎకరాల సాగునీరు కేసీఆర్‌ – ఆ ఒక్కటీ అడక్కు
* కాంట్రాక్టు ఉద్యోగులకు పర్మినెంట్‌ కేసీఆర్‌ – ఆ-ఒక్కటీ అడక్కు
* రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ కేసీఆర్‌ – ఆ ఒక్కటీ అడక్కు
*గ్రామపంచాయతీకి 20 లక్షలు కేసీఆర్‌ – ఆ ఒక్కటీ అడక్కు
* జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేసీఆర్‌ – ఆ ఒక్కటీ అడక్కు
* పంటకు కనీస మద్దతు ధర కేసీఆర్‌ – ఆ ఒక్కటీ అడక్కు
* మూసీ ప్రక్షాళన కేసీఆర్‌- ఆ ఒక్కటీ అడక్కు
* జిల్లా కేంద్రాల్లో సూపర్‌స్పెషాల్టీ హాస్పిటల్‌ కేసీఆర్‌ – ఆ ఒక్కటీ అడక్కు
* రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ కేసీఆర్‌ – ఆ ఒక్కటీ అడక్కు

Exit mobile version