NTV Telugu Site icon

BJP Sai Ganesh: నిశ్చితార్థమైన యువతి ఆత్మహత్యాయత్నం..

Sai Ganesh

Sai Ganesh

ఈనెల 14న ఆత్మహత్య చేసుకున్న సాయి గణేష్ వివాహం చేసుకోవలసిన విజయ అనే అమ్మాయి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసింది. బీజేపీ నాయకుడు సాయి గణేష్-విజయల వివాహం మే 4 తారీఖున జరగవలసి ఉంది. అయితే పోలీసుల వేధింపుల వల్ల సాయి గణేష్ ఈనెల 14వ తేదీన త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఆత్మహత్య యత్నం చేసుకోగా 16వ తేదీన మృతి చెందాడు.

ఈ సంఘటనపై ఇప్పటికే అధికార పార్టీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపున సాయి గణేష్ ని ప్రేమించిన విజయ అనే అమ్మాయి ఈరోజు మధ్యాహ్నం నుంచి జూబ్లీపురలో సాయి గణేష్ నిర్మించిన బీజేపీ స్తూపం వద్ద ఉండిపోయింది. నిద్ర మాత్రలు మింగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఇది గమనించిన స్థానికులు ఆమెను ప్రభుత్వ ఆసుపత్రిలో తరలించి.. విజయకు చికిత్స కొనసాగిస్తున్నారు.