ఈనెల 14న ఆత్మహత్య చేసుకున్న సాయి గణేష్ వివాహం చేసుకోవలసిన విజయ అనే అమ్మాయి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసింది. బీజేపీ నాయకుడు సాయి గణేష్-విజయల వివాహం మే 4 తారీఖున జరగవలసి ఉంది. అయితే పోలీసుల వేధింపుల వల్ల సాయి గణేష్ ఈనెల 14వ తేదీన త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఆత్మహత్య యత్నం చేసుకోగా 16వ తేదీన మృతి చెందాడు. ఈ సంఘటనపై ఇప్పటికే అధికార పార్టీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.…