Site icon NTV Telugu

Ramchander Rao : జూబ్లీహిల్స్ గెలిచి నరేంద్రమోడీకి గిఫ్ట్ గా ఇద్దాం

Bjp Ramchander Rao

Bjp Ramchander Rao

Ramchander Rao : హైదరాబాద్‌ను బీజేపీ కంచుకోటగా మలచామని, GHMC ఎన్నికల్లో 48 సీట్లు గెలిచిన విషయమే దీనికి నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీజేపీకి మంచి ఓటు షేర్ రావడం ప్రజలు ప్రత్యామ్నాయంగా కేవలం బీజేపీనే భావిస్తున్నారని ఆయన అన్నారు. హైదరాబాద్ నగరంలోని సమస్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన రామచందర్ రావు, “డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి, మ్యాన్‌హోల్స్ నోళ్లు తెరిచి ఉన్నాయి. వర్షాకాలం ప్రమాదాలపై ముందుగానే హెచ్చరించినా GHMC అధికారులు స్పందించడం లేదు. ఇది చెవిటి వాడి చెవిలో శంఖం ఊదినట్లుంది” అని మండిపడ్డారు. ప్రభుత్వంపై కూడా దాడి చేసిన ఆయన, “ప్రజల ప్రాణాలు పణంగా పెట్టినా కళ్ళు తెరవడం లేదు” అని విమర్శించారు.

SSMB 29 : భయంకర అడవుల్లో రాజమౌళి, మహేశ్ షూట్.. నమ్రత రియాక్ట్

రాబోయే జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్, BRS పార్టీలకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని రామచందర్ రావు పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించిన ఆయన, “రేవంత్ రెడ్డి ఓట్లు చోరీ చేస్తున్నారు. మజ్లీస్ మద్దతుతో గెలిచే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే తరహా ఓటు చోరీతోనే హైదరాబాద్ పార్లమెంట్‌లో MIM గెలుస్తోంది” అని ఆరోపించారు. BRSపై మాట్లాడుతూ, “ఆ పార్టీ గురించి బాధపడాల్సిన పనిలేదు. ఆస్తుల కోసం ఆ పార్టీ నేతల కుటుంబంలోనే కలహాలు ముదురుతున్నాయి” అన్నారు. మరోవైపు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు తెలంగాణ కోసం అహోరాత్రులు కష్టపడుతున్నారని చెప్పారు. రాష్ట్ర కాంగ్రెస్ కేంద్ర పథకాలను కూడా తమవిగా చూపి ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. “జూబ్లీహిల్స్ ఉపఎన్నికను గెలిచి నరేంద్రమోడీకి గిఫ్ట్‌గా అందించాలి” అని బీజేపీ కార్యకర్తలకు రామచందర్ రావు పిలుపునిచ్చారు.

Alleti Maheshwar Reddy : ఇది ప్రజల సమస్యలపై చర్చను అణగదొక్కే ప్రయత్నం

Exit mobile version