Site icon NTV Telugu

Dr K Laxman: సీఎంఓ నుండి ఆదేశాలొస్తే తప్ప ఫలితాలు వెల్లడించరా?

Dr.lakshaman

Dr.lakshaman

Dr K Laxman: మునుగోడు ఎన్నికల లెక్కింపు ఫలితాల వెల్లడిలో గందరగోళంపై బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు బీజేపీ రాజ్య సభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కో అధికారి ఒక్కో విధంగా చెబుతూ ఫలితాలపై కావాలనే గందరగోళం సృష్టిస్తున్నారని అన్నారు. సీఎంఓ నుండి ఆదేశాలొస్తే తప్ప ఫలితాలు వెల్లడించరా? అంటూ ప్రశ్నించారు. కుంటి సాకులు చెబుతూ టీఆర్ఎస్ కు ఆధిక్యం వచ్చేదాకా కౌంటింగ్ ప్రక్రియను జాప్యం చేస్తారా? అని ప్రశ్నించారు. బీజేపీకి లీడ్ వచ్చే రౌండ్లలోనే ఫలితాలను అప్ డేట్ చేయడంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? డాక్టర్ కె.లక్ష్మణ్ మండిపడ్డారు. ఎన్నికల మొదటి రోజు నుండి కౌంటింగ్ దాకా సీఈవో పనితీరు అనుమానాస్పదమే అని ఆరోపించారు.

Read also: Munugode Bypoll Results: ఫలితాల వెల్లడికి అసలు కారణం ఇదే-ఈసీ

రాష్ట్ర ప్రభుత్వ కనుసన్నల్లోనే సీఈవో పనిచేస్తున్నారని ఆరోపించారు. పోలింగ్ రోజు టీఆర్ఎస్ స్థానికేతర నాయకులు మునుగోడులో మకాం వేస్తే… ఎవరూ లేరని సీఈవో చెప్పడం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఫిర్యాదు చేసిన తరువాత కూడా చర్యలు ఎందుకు తీసుకోలేదు? అని ప్రశ్నించారు. ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో వ్యక్తం అవుతుందని అన్నారు. మంత్రులే విందు భోజనాలు పెట్టిన ప్రజలు చెంప పెట్టు సమాధానం చెప్పారని అన్నారు. ఎంత ప్రభావితం చేసిన ప్రజలు లొంగలేదని అన్నారు. ప్రజలకు హాట్స్ అప్ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. ప్రజా స్వామ్యంలో గెలుపు ఓటములు సహజమని నైతికంగా ఇప్పటికే రాజ్ గోపాల్ రెడ్డి విజయం సాధించారని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ గెలుస్తుంది అనే నమ్మకం ఉందని అన్నారు.

Exit mobile version