NTV Telugu Site icon

JP Nadda to meet Nithin and Mithali Raj: తెలంగాణ పర్యటనకు జేపీ నడ్డా.. హీరో నితిన్‌, క్రికెటర్‌ మిథాలీరాజ్‌తో భేటీ..!

Jp Nadda

Jp Nadda

మరోసారి తెలంగాణ పర్యటనకు వస్తున్నారు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా… హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు ఆయన ముఖ్య అతిథిగా రాబోతున్నారు. ఇదే సమయంలో.. టాలీవుడ్‌ హీరో నితిన్‌తో పాటు.. మహిళా క్రికెటర్‌ మిథాలీరాజ్‌తో సమావేశం కానుండడం హాట్ టాపిక్‌గా మారిపోయింది.. ఇవాళ ఉదయం 11:45 గంటలకు సతీసమేతంగా జేపీ నడ్డా శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకోనున్నారు.. మొదట నోవాటెల్‌ హోటల్‌కు వెళ్లనున్నా ఆయన.. మధ్యాహ్నం 12 గంటలకు మహిళా క్రికెటర్‌ మిథాలీరాజ్‌తో సమావేశం అవుతారని చెబుతున్నారు.. ఆ తర్వాత బీజేపీ ముఖ్యనేతలతోనూ నడ్డా సమావేశం అవుతారని పార్టీ వర్గాలు చెబుతున్నమాట.. ఈ భేటీలో తెలగానలోని తాజా రాజకీయ పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలపై చర్చించనున్నారు.. ఇక, ఆ తర్వాత ప్రత్యేక హెలికాప్టర్‌లో వరంగల్‌కు చేరుకోనున్నారు..

Read Also: CM KCR: రైతు సంఘాల నేతలతో నేడు సీఎం కేసీఆర్‌ భేటీ

ఇవాళ్టితో బండి సంయ్‌ పాదయాత్ర ముగియనున్న నేపథ్యంలో.. బండి సంజయ్‌, ఇతర పార్టీ నేతలతో కలిసి భద్రకాళీ అమ్మవారిని దర్శించుకోనున్నారు జేపీ నడ్డా.. సతీసమేతంగా భద్రకాళీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు నడ్డా.. అనంతరం ప్రొఫెసర్‌ వెంకటనారాయణతో భేటీ కానున్నారు. అక్కడి నుంచి నేరుగా బీజేపీ భారీ బహిరంగ సభా ప్రాంగణానికి చేరుకుంటారు. సాయంత్రం 4 గంటల నుంచి 5 వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. సభ ముగించుకుని హెలికాప్టర్‌లో శంషాబాద్‌కు బయల్దేరతారు.. రాత్రికి నోవాటెల్‌లో సినీ హీరో నితిన్‌తో భేటీకానున్నారు. ఆ తర్వాత అనంతరం రాత్రి 7 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి తిరుగు పయనం కానున్నారు బీజేపీ చీఫ్‌.. అయితే, ఈ మధ్యే తెలంగాణకు వచ్చిన కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షా… టాలీవుడ్‌ యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ను కలవడం.. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ చర్చకు దారి తీసింది.. ఇప్పుడు నితిన్‌తో సమావేశం కానుండడం హాట్‌ టాపిక్‌ అయ్యింది.

జేడీ నడ్డా మినిట్‌ టు మినిట్‌ షెడ్యూల్‌ ఇలా..
* ఇవాళ ఉదయం 11.45 గంటలకు శంషాబాధ్‌ ఎయిర్‌పోర్ట్‌కు సతీసమేతంగా చేరుకోనున్న జేపీ నడ్డా
* మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఎయిర్‌పోర్ట్‌ సమీపంలోని నోవాటెల్‌కు జేపీ నడ్డా..
* నోవాటెల్‌ హోటల్‌లో మహిళా క్రికెటర్‌ మిథాలీరాజ్‌తో సమావేశం అయ్యే అకాశం
* బీజేపీ తెలంగాణ ముఖ్యనేతలతో భేటీకానున్న నడ్డా, రాష్ట్రంలోని తాజా పరిణామాలు, ఘటనలపై చర్చ
* శంషాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయల్దేరి మధ్యాహ్నం 2.40 గంటలకు వరంగల్ చేరుకోనున్న జేపీ నడ్డా..
* మధ్యాహ్నం 3 గంటల నుంచి 3.15 గంటల వరకు వరంగల్ భద్రకాళీ అమ్మవారి దర్శనం‌
* సాయంత్రం 4.10 నుంచి 5.40 గంటల వరకు పాదయాత్ర ముగింపు సభలో పాల్గొననున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు
* సాయంత్రం 5.55కు వరంగల్ నుంచి శంషాబాద్‌ నోవాటెల్‌కు చేరుకోనున్న నడ్డా..
* నోవాటెల్‌ హోటల్‌లో జేపీ నడ్డాను కలవనున్న హీరో నితిన్‌
* రాత్రి 7 గంటల తర్వాత శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణంకానున్న జేపీ నడ్డా..

Show comments