తెలంగాణపై బీజేపీ ఫోకస్ పెట్టింది. మొన్న మోడీ.. నిన్న అమిత్ షా.. నేడు తరుణ్‌చుగ్ రానుండటంతో.. తెలంగాణ రాష్ట్రంపై దృష్టి పెట్టిందనే చెప్పాలి. ప్రధాని నరేంద్ర మోదీ May 26న హైదరాబాద్ లో రెండున్నర గంటల పాటు రాష్ట్ర రాజధానిలో పర్యటించిన విషయం తెలిసిందే.. నగరంలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) 20వ వార్షికోత్సవంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు.
కాగా.. JUNE 02న అమిత్ రాష్ట్రంలో పర్యటించారు. తెలంగాణ బీజేపీ అద్యక్షుడు బండి సంజయ్ నిర్వహించిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో షా సుదీర్ఘ ప్రసంగం చేసిన విషయం తెలిసిందే.. మొన్నటి వరకు మోడీ, అమిత్ షాలు పర్యటించగా.. నేడు తరుణ్ చుగ్ రానున్నడంగో బీజేపీ వర్గాల్లో జోష్ పెరిగింది.
దీంతో.. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశలపై అధిష్ఠానం స్పీడ్ పెంచిందనే చెప్పాలి. ఈ సమావేశాలపై చర్చలో భాగంగా బీజేపీ తెలంగాణ ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్ నేడు రాష్ట్రానికి రానున్నారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యాలయంలో ముఖ్యనేతలు, పదాధికారులతో తరుణ్ చుగ్ సమావేశం కానున్నారు. ఈ భేటీలో పార్టీకి సంబంధించిన కీలక అంశాలపై చర్చిస్తారు.
జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం 34కమిటీలను నియమించనున్నారు. ఈ 34 కమిటీలకు తరుణ్ చుగ్ దిశానిర్దేశం చేయనున్నారు. జూలై 2,3 తేదీల్లో హైదరాబాద్ వేదికగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా సహా.. కేంద్ర క్యాబినెట్, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశాలకు హాజరవుతారు. వీరంతా రెండు రోజులపాటు హైదరాబాద్‌లో మకాం వేస్తారని సమాచారం.
ఈ నెల 15 న సర్పంచులతో రాజ్ భవన్‌కు పెండింగ్ బిల్లులు, ఇతర సమస్యలను గవర్నర్ తమిళిసై దృష్టికి తీసుకు వెళ్లేందుకు ఈ నెల 15 న సర్పంచులతో కలిసి బండి సంజయ్ రాజ్ భవన్ వెళ్లనున్నారు.
