Site icon NTV Telugu

Etela Rajender Fires on Harishrao: ఆ మీటింగ్ కి హరీష్ ఎందుకెళ్లలేదు? ఈటల ఫైర్

Harishetele

Harishetele

రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావుపై మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ఢిల్లీలో నిన్న జరిగిన బడ్జెట్ రూపకల్పన మీటింగ్ కి హాజరుకాకపోవడంపై ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల తర్వాత ఏ డిపార్ట్మెంట్లో కూడా ఆయా అధికారులతో సమావేశం ఏర్పాటు చేసుకునే అవకాశం లేకుండా చేశారు. మంత్రులు, ఆఫీసర్లతో మీటింగ్ పెట్టుకుని బడ్జెట్ రూపకల్పన చేసుకోనేవారు.. కానీ కెసిఆర్ ఆ సంప్రదాయాన్ని ఖతం పట్టించారని విమర్శించారు ఈటల రాజేందర్.

Read Also: Ambati Rambabu: ఆఖరి ఛాన్స్ అంటే అధికారం రాదు.. ప్రజల మెప్పు పొందాలి

ముఖ్యమంత్రి గారే స్వయంగా అధికారులను పిల్చుకొని బడ్జెట్ రాసి ఇచ్చుడు తప్ప ఎక్కడ కూడా సంపూర్ణమైన చర్చ బడ్జెట్ మీద డిపార్ట్మెంట్ల వారిగా జరిగే పరిస్థితి లేదు. రాచరికం లాగా వ్యవహరిస్తున్నారు తప్ప డిపార్ట్మెంట్ వారిగా నిధులు ఇవ్వటం లేదు.కేంద్ర ప్రభుత్వం తన సంప్రదాయాల ప్రకారం అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులను పిలిస్తే మన రాష్ట్ర ఆర్థిక మంత్రి డుమ్మా కొట్టారు. నిర్లక్ష్యంగా, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ రాష్ట్ర భవిష్యత్తు పట్ల, రాష్ట్ర ప్రజల పట్ల కమిట్మెంట్ లేదు, విశ్వాసం లేదు అనటానికి ఇది సజీవ సాక్ష్యం అన్నారు.

కొద్ది రోజులుగా గగ్గోలు పెడుతున్నారు..మాకు వచ్చే ఎఫ్ఆర్బియం రుణాల్లో 15 వేల కోట్ల రూపాయలు కోత పెట్టారని.. మనకు వచ్చే గ్యారెంటీ రుణాలలో కోత పెట్టారు అని మొత్తం.. 40 వేల కోట్ల రూపాయల రుణాలు రాకుండా చేస్తున్నారని చెప్తున్నారు.కానీ ఇవి అన్ని రుణాలు.. సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ కింద లేదా గ్రాంట్ కింద వచ్చే డబ్బు కాదు… ఇది తెలంగాణ ప్రభుత్వం తీసుకునే అప్పు. ఇప్పటికే పరిధి దాటిపోయారు.

అప్పుల కుంపటిగా మారిపోయారు, అని తెలుసుకొని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఇచ్చిన నివేదిక ఆధారంగా రుణం నిలిపివేస్తే అది కేంద్ర ప్రభుత్వం మీద నేడుతున్నారు. గణాంకాల శాఖ దేశంలో ధరల పెరుగుదల మీద సర్వే చేస్తే మన రాష్ట్రంలో 8.75% ద్రవ్యోల్బణం పెరిగింది అని రిపోర్ట్ ఇచ్చారు. దేశంలో నెంబర్ వన్ తెలంగాణ అని చెప్పే ముఖ్యమంత్రి గారు ధరల పెరుగుదలలో, ప్రజలనడ్డి విరవడంలో నెంబర్ వన్ తెలంగాణ వచ్చింది అంటే సిగ్గుతో తలదించుకోవాలి. తెలంగాణ అప్పుల కుంపటిలా మారిందని మండిపడ్డారు.

Read Also: Orange Movie: కల్ట్ క్లాసిక్ ‘ఆరెంజ్’ .. ఎందుకు ప్లాప్ అయ్యిందో తెలుసా..?

Exit mobile version