మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన మూడో సినిమా ఆరెంజ్
రామ్ చరణ్ కెరీర్ లోనే అల్ట్రా స్టైలిష్ లుక్ లో కనిపించిన సినిమా ఆరెంజ్
బొమ్మరిల్లు, పరుగు సినిమాల తరువాత భాస్కర్ దర్శకత్వం వహించిన చిత్రం ఆరెంజ్
ఆరెంజ్ సినిమాను చరణ్ బాబాయ్ నాగబాబు నిర్మించారు
చాలా మంది హీరోయిన్లను వెతికాక జానుగా జెనీలియా సెట్ అవుతుందని ఆమెను తీసుకున్నారు
2010, నవంబర్ 26 న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ పరాజయాన్ని అందుకొంది
ప్రేమ కొంతకాలమే బావుంటుంది అనే కాన్సెప్ట్ అప్పట్లో ప్రేక్షకులకు ఎక్కలేదు. దీంతో పాటు ఆరెంజ్ సినిమా ప్లాప్ అవ్వడానికి మిగతా కారణాలు ఏంటంటే
స్క్రీన్ ప్లే సరిగ్గా కుదరకపోవడం వల్లే ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించలేదని బొమ్మరిల్లు భాస్కర్ స్వయంగా ఒప్పుకున్నాడు
ప్రేమ కొద్దికాలం మాత్రమే ఉంటుంది అన్న నిజాన్ని ప్రేక్షకులు ఒప్పుకోలేకపోయారు.. అందుకే సినిమాను ఆదరించలేదని చెప్పుకొస్తారు
అసలుకి ఆరెంజ్ ఒక వినూత్న ప్రయోగం.. ఒక ట్రెండ్ సెట్టర్.. కానీ ఆ సమయంలో అటువంటి కంటెంట్ ఎవరు చూపించకపోవడంతో ప్రేక్షకులు లైట్ తీసుకున్నారు
ఆరెంజ్ సినిమాకు సంబంధము లేని టైటిల్
కావడంతో చాలామందికి అర్థంకాక సినిమాకు వెళ్లలేదని చెప్పుకొస్తున్నారు
నేటితో ఈ సినిమా 12 ఏళ్ళు పూర్తిచేసుకొంది.. ఈ సమయంలో ఈ సినిమా రిలీజ్ అయ్యి ఉంటే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యి ఉండేదని అభిమానులు అంటున్నారు
ఆరెంజ్ సినిమాతో నిర్మాతగా నాగబాబు ఎంతో నష్టపోయాడు