NTV Telugu Site icon

Eetala Rajender: కేసీఆర్‌ను గజ్వేల్ ప్రజలే బొందపెడతారు

Eetala Rajender

Eetala Rajender

సీఎం కేసీఆర్‌పై హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీఆర్‌కు అహంకారం పెరిగిపోయిందని ఆరోపించారు. కేసీఆర్ అహంకారం తొలగిపోయేరోజు దగ్గరలోనే ఉందన్నారు. తన 20 ఏళ్ల రాజకీయ చరిత్రలో తనపై ఎవరూ అనుచిత వ్యాఖ్యలు చేయలేదని.. కానీ కేసీఆర్ తనను పదే పదే టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. తనను టీఆర్ఎస్ పార్టీ నుంచి గెంటేశారని.. తాను పార్టీ నుంచి బయటకు వెళ్లలేదని ఈటల అన్నారు. కేసీఆర్‌ తరహాలో తాను సంస్కారం లేకుండా మాట్లాడనని స్పష్టం చేశారు. ఆనాడు గజ్వేల్‌లో ఏ ప్రజలైతే కేసీఆర్‌కు ఓట్లు వేశారో.. ఇప్పుడు అదే ప్రజలు ఆయన్ను బొందపెట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. కేసీఆర్ వ్యూహాలు తనకు తెలుసన్న ఈటల.. గజ్వేల్‌లో బీజేపీ గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు.

Read Also: KTR: రాష్ట్రంలో 5 రంగాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయి.

చరిత్ర నిర్మాతలు పార్టీలు కాదని.. చరిత్ర నిర్మాతలు ప్రజలు అని ఈటల వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీకి, కేసీఆర్‌కు అసలు పోలికే లేదన్నారు. శ్రీలంకలో పాలకులను తరిమికొట్టినట్లే.. తెలంగాణ కుటుంబపాలనను తరిమికొట్టే రోజు వస్తుందని ఈటల తెలిపారు. తనను ఈ స్థాయికి తెచ్చింది ఎవరో కాదని.. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు అని ఈటల స్పష్టం చేశారు. తనకు చైతన్యాన్ని ఇచ్చిన గడ్డ హుజురాబాద్ అని అభిప్రాయపడ్డారు. తనకు తన నియోజకవర్గం ఎంతో ధైర్యాన్ని ప్రసాదించిందన్నారు.

Show comments