Site icon NTV Telugu

BJP National Executive Meeting: రెండో రోజు బీజేపీ స‌మావేశం.. హెచ్ఐసీసీ వేదికగా..

Bjp Meting

Bjp Meting

ఇవాళ రెండో రోజు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హెచ్ఐసీసీ వేదికగా ప్రారంభమయ్యాయి. ఈ నేప‌థ్యంలో.. తెలంగాణపై ప్రత్యేక చర్చ జరుగుతున్నట్లు సమాచారం. భాగ్యనగర్ డిక్లరేషన్ పేరుతో కీలక రాజకీయ తీర్మానాన్ని బీజేపీ ఆమోదించనుంది. నిన్న మొదటి రోజు (శనివారం) సమావేశాలకు హాజరైన ప్రధాని మోదీ రాత్రి నోవాటెల్ హోటల్‌లో బస చేశారు. అయితే.. తెలంగాణలో పాగావేయాలనే ప్రయత్నాలు.. దక్షిణాదిన విస్తరించాలనే వ్యూహంలో భాగంగా జాతీయ కార్యవర్గ సమావేశాలను బీజేపీ హైదరాబాద్‌లో నిర్వహిస్తోంది.

read also: godhra riots: గోద్రా అల్లర్ల కేసులో నిందితుడికి జీవిత ఖైదు

బీజేపీ జాతీయ కార్య వ‌ర్గ స‌మావేశాల‌కు ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతోపాటు కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ముఖ్య నాయకులు, 350 మంది ప్రతినిధులు హైదరాబాద్‌కు తరలివచ్చారు. నిన్న శనివారం తొలిరోజు సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. ఈ రోజు కార్యవర్గ సమావేశంలో మోదీ, అమిత్ షాలు ప్రసంగించనున్నారు. బీజేపీ పార్టీ బలోపేతానికి ఉద్దేశించిన అంశాలను ఈ సమావేశంలో చర్చిస్తామని హైదరాబాద్ వచ్చిన వెంటనే ప్రధాని ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యవర్గసమావేశం ముగిసిన అనంతరం సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో బీజేపీ విజయ సంకల్ప సభ జరగనుంది. ఇందులో భాగంగా లక్షలాది మంది పాల్గొనే ఈ భారీ బహిరంగసభలో ప్రధాని మోడీ కీలక ఉపన్యాసం చేయనున్నారు.

Exit mobile version