Site icon NTV Telugu

Manohar Reddy: యాత్రను ఎవరు అడ్డుకోలేరు.. తోక ముడుచుకొని ఇంట్లోనే కూర్చోవాలి

Manohar Reddy

Manohar Reddy

యాత్రను ఎవరు అడుకొలేరు, తోక ముడుచుకొని ఇంట్లోనే కూర్చోవాలని సంజయ్ సంగ్రామ యాత్ర ఇంఛార్జి బీజేపీ నేత మనోహర్ రెడ్డి అన్నారు. పోలీసులు అనుమతి ఇచ్చిన ఇవ్వకున్న యాత్ర కొనసాగుతుందని అన్నారు. కోర్ట్ కి వెళ్ళి అనుమతి తెచ్చుకుంటామని స్పష్టం చేశారు. ఈ సందర్బంగా.. ప్రజా సంగ్రామ యాత్ర రూట్ మ్యాప్ ని బీజేపీ నేతలు విడుదల చేసారు. మూడో విడత సందర్భంగా ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేసిందని అన్నారు. పది రోజుల పాటు మల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధిలో నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతందని తెలిపారు. ముగ్గురు పోలీస్ కమిషనర్ లకు యాత్ర రూట్ ఇచ్చి, అనుమతులు కోరామన్నారు. రాతపూర్వక అనుమతులు ఇంకా ఇవ్వలేదని అన్నారు. గతంలో మాదిరిగానే అనుమతులు ఇచ్చారని భావిస్తున్నామన్నారు.

ఈ నెల 12 న కుత్బల్లపూర్ నియోజక వర్గం చిత్తరమ్మ దేవాలయం నుండి ప్రారంభమవుతుందని అన్నారు. ప్రారంభ కార్య్రమానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ పాల్గొంటారని అన్నారు. డబల్ బెడ్ రూం లు ఇవ్వలేదని మండిపడ్డారు. ట్రాఫిక్ పోలీస్ లు ట్రాఫిక్ నీ కంట్రోల్ చేయకుండా డ్రంక్ అండ్ డ్రైవ్, చలాన్ లు వేయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. రోడ్ల పరిస్థితి, జవహర్ నగర్ ఇష్యూ తో పాటు పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ యాత్ర ద్వారా హై లైట్ చేస్తామన్నారు.
Allu Aravind: ‘రామాయణ’ వెనక్కి… ‘మహాభారతం’ ముందుకు!

Exit mobile version