టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్.. భారతీయ జనతా పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు.. ఇప్పటికే కేంద్ర నాయకత్వాన్ని కలిసిన ఆయన.. తనకున్న అనుమానాలపై చర్చించినట్టుగా తెలుస్తోంది.. అయితే, ఈటల.. బీజేపీలోకి టచ్‌లోకి వచ్చాడన్న వార్తలు వచ్చినప్పటి నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు మరో బీజేపీ నేత పెద్దిరెడ్డి.. అసలు ఈటల వస్తే.. పార్టీలో ప్రకంపణలు తప్పవని స్టేట్‌మెంట్ కూడా ఇచ్చారు.. ఇక, ఆయనను అప్పడి నుంచి బుజ్జగిస్తూనే ఉంది రాష్ట్ర పార్టీ.. ఇప్పటికే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా పెద్దిరెడ్డితో మాట్లాడారు.. ఈటల చేరిక , పెద్దిరెడ్డి అనుమానాలను నివృత్తి చేశారు.. అయితే, ఈటల అంశం తనకు చెప్పక పోవడం పై పెద్దిరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.. మరోవైపు.. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కూడా పెద్దిరెడ్డి ఇంటికి వెళ్లారు.. ఈటల అంశంపైనే ప్రధానంగా చర్చ సాగింది.. అంతా కలిసి పార్టీ కొసం పని చేయాలని డీకే అరుణ సూచించినట్టుగా తెలుస్తోంది. మొత్తంగా ఈటల చేరిక పెద్దిరెడ్డిని అసంతృప్తికి గురిచేయగా.. పార్టీ నేతలు మాత్రం ఆయను బుజ్జగించేపనిలో పడ్డారు.
ఈటల చేరిక..! పెద్దిరెడ్డికి బీజేపీ బుజ్జగింపులు
Etela Peddi Reddy