NTV Telugu Site icon

టీఆర్‌ఎస్‌పై గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ నల్గొండ పర్యటనలో జరిగిన దాడిపై నేడు గవర్నర్‌ తమిళసై సౌందర రాజన్‌కు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. బండి సంజయ్‌ నల్లొండలో పర్యటిస్తున్న సమయంలో ఆయన కాన్వాయ్‌పై రాళ్లతో దాడి చేశారు. అయితే దీనిపై పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు.

అంతేకాకుండా టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని తెలుపుతూ గవర్నర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లడుతూ.. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయన్నారు. గ్రామాల్లోకి వెళ్లి రైతుల బాధలు తెలుసుకోనేందుకు ప్రయత్నించిన బండి సంజయ్‌పై దాడులు చేయించడం సమంజసం కాదన్నారు.