కరోనా మహమ్మారి వెటకారంగా మాట్లాడుతున్నారంటూ తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఫైర్ అయ్యారు మాజీ ఎంపీ, బీజేపీ నేత విజయశాంతి… జూబ్లీహిల్స్ శ్రీరాంనగర్‌లోని వ్యాక్సిన్ సెంటర్‌ను పరిశీలించిన ఆమె.. వ్యాక్సినేషన్ ప్రక్రియను దగ్గరుండి పరిశీలించారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరోనా గురించి సీఎం కేసీఆర్ వెటకారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.. ఇప్పటికైనా కేసీఆర్ వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించిన ఆమె.. సీఎం బాధ్యతగా ఉండి ఉంటే ఇన్ని ప్రాణాలు పోయేవికావన్నారు. పారాసిట్మాల్ తో కరోనా తగ్గితే యశోదా ఆస్పత్రిలో ఎందుకు చికిత్స తీసుకున్నారో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేసిన ఆమె.. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుని కేసీఆర్ మాట్లాడితే బాగుండేదన్నారు.. కొన్ని వ్యాక్సినేషన్ కేంద్రాల్లో ప్రజలనే సిరంజిలు తెచ్చుకోమని సిబ్బంది చెప్పటం సరైంది కాదన్న ఆమె.. పూర్తి ఉచితంగా వ్యాక్సినేషన్ వేయమని స్వయాన ప్రధాని చెప్పారని గుర్తుచేశారు.. వ్యాక్సిన్ వేయటంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించిన రాములమ్మ.. కనీస ఏర్పాట్లు చేయరా? అని మండిపడ్డారు.. ఇక, కరోనా బారినపడకుండా ప్రజలంతా విధిగా మాస్కులు ధరించాలని విజ్ఞప్తి చేశారు విజయశాంతి..మరోవైపు.. మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలపై మాట్లాడటానికి విజయశాంతి నిరాకరించారు.
కరోనాపై కేసీఆర్‌ది వెటకారం.. విజయశాంతి ఫైర్

Vijayashanthi