
సినీనటి, బీజేపీ నేత విజయశాంతి కేసీఆర్ పై మరోమారు విరుచుకుపడ్డారు. కేసీఆర్ కి ఏనాడు దళిత బిడ్డలపై ప్రేమ లేదని అన్నారు. బడుగు బలహీన వర్గాలను చిన్నచూపు చూస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఇచ్చిన మాటకు కట్టుబడి లేదని, కేసీఆర్ చాలా హీనంగా మాడ్లాడుతున్నారని, తెరాస గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంట మంచిది అని విజయశాంతి పేర్కొన్నారు. కేసీఆర్ కుటుంబపాలన పోవాలని, అందరికి న్యాయం జరగాలని విజయశాంతి ఆకాంక్షించారు. కేసీఆర్, మంత్రులు ప్రజల్ని కుక్కలు అం సంబోధిస్తున్నారని మండిపడ్డారు. తెరాస నేతల వార్నింగ్ లకు తాము భయపడేది లేదని, ఎంత దూరమైనా వెళ్తామని విజయశాంతి పేర్కొన్నారు. అరాచక ప్రభుత్వానికి ప్రజలే బుద్ధిచెప్తారని, తప్పుచేస్తే రాళ్లతో కొట్టమని కేసీఆర్ గతంలో చెప్పారని, కేసీఆర్ కు త్వరలోనే ఆ పరిస్థితి వస్తుందని విజయశాంతి పేర్కొన్నారు.