Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Bjp Leader Sunil Bansal Met Telangana Leaders

BJP Metting: తెలంగాణ నేతలతో బన్సాల్ భేటీ.. రెండు రోజుల సమావేశాల్లో 100 రోజుల కార్యాచరణ

Published Date :July 11, 2023 , 11:26 am
By NTV WebDesk
BJP Metting: తెలంగాణ నేతలతో బన్సాల్ భేటీ.. రెండు రోజుల సమావేశాల్లో 100 రోజుల కార్యాచరణ
  • Follow Us :
  • google news
  • dailyhunt

BJP Metting: తెలంగాణ బీజేపీ నేతలతో ఆ పార్టీ అగ్రనేత సునీల్ బన్సాల్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. బీజేపీ కూడా వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. బీజేపీ తెలంగాణ ఇన్‌ఛార్జ్ సునీల్ బన్సాల్ మూడు రోజులుగా పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. సునీల్ బన్సాల్ ఇవాళ కూడా బీజేపీ నేతలతో సమావేశం కానున్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని నియమించిన తర్వాత సునీల్ బన్సాల్ పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావాలనే పట్టుదలతో పార్టీ ఉంది. అయితే ఇటీవలి కాలంలో పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు రాజకీయంగా ఆ పార్టీని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. మరోవైపు రాజకీయంగా కాంగ్రెస్ కు కలిసి వచ్చిందనే అభిప్రాయం రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. బండి సంజయ్‌ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించడంపై ఆ పార్టీలోని కొందరు అసంతృప్తితో ఉన్నారని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో పార్టీ నేతలతో సునీల్ బన్సల్ వరుస భేటీలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ఈ నెల 9వ తేదీన దక్షిణాది రాష్ట్రాలకు చెందిన బీజేపీ నేతలతో ఆ పార్టీ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో 11 రాష్ట్రాల బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. జేపీ నడ్డా, సునీల్ బన్సాల్ ఈ నెల 9 సాయంత్రం తెలంగాణకు చెందిన పార్టీ నేతలతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై చర్చించారు. భవిష్యత్తుపై నేతలు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ నేతలు సమన్వయంతో పని చేయాలని నడ్డా సూచించారు. జేపీ నడ్డాతో భేటీ అనంతరం బీజేపీ నేత సునీల్ బన్సాల్ కూడా తెలంగాణ నేతలతో సమావేశమయ్యారు. ఈరోజు కూడా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, జిల్లా అధ్యక్షులతో సునీల్ బన్సాల్ సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, రానున్న రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ అత్యధిక ఎంపీ సీట్లను గెలుచుకోవడంలో సునీల్ బన్సాల్ కీలక పాత్ర పోషించారు. బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణపై దృష్టి సారించింది. దరిమిలా సునీల్ బన్సాల్‌ను పార్టీ అధిష్టానం నియమించిందనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. ఈ పరిణామం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపదని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. అయితే కర్ణాటక ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపనున్నాయి. మరోవైపు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. ఈ నెలలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. బీజేపీ అసంతృప్తి నేతలు కూడా కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

ఈ తరుణంలో రాష్ట్రంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు బన్సల్ రంగంలోకి దిగారు. రెండు రోజుల సమావేశాల్లో 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. బీజేపీ ప్రచారంతో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి వెళ్లాలని సునీల్ బన్సాల్ పార్టీ నేతలకు సూచించారు. అంతేకాదు ఆయా ప్రాంతాల్లోని ప్రముఖులను, బీజేపీ నేతలను కూడా కలవనున్నారు. మరోవైపు ఆయా నియోజకవర్గాల్లో పార్టీ అగ్రనేతల బహిరంగ సభలు కూడా నిర్వహించనున్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పార్టీ నాయకత్వం కూడా కార్యాచరణ సిద్ధం చేస్తుంది. బీజేపీ నాయకత్వం ఎస్సీ, ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాలపై కూడా దృష్టి పెట్టనుంది.
Kim Yo Jong: ఉత్తర కొరియా గగనతలంలోకి అమెరికా గూఢచారి విమానం.. కిమ్ సోదరి వార్నింగ్!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bandi sanjay
  • BJP leader Sunil Bansal
  • Kishan‌Reddy
  • pongulety
  • Sunil Bansal met bjp leaders

తాజావార్తలు

  • Off The Record: బీఆర్ఎస్‌ కంచుకోట.. సిద్దిపేటలో బలహీనపడుతున్న కాంగ్రెస్..

  • Earthquake: ఢిల్లీలో భూకంపం.. ప్రాణ భయంతో వీధుల్లోకి పరుగులు పెట్టిన జనాలు..

  • DA Hike: ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లకు శుభవార్త.. ఈ సారి భారీగానే పెరుగుదల..!?

  • Off The Record: తెలంగాణ ఈఎన్సీ జనరల్ పోస్ట్ కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ..

  • Toothpaste: టూత్ పేస్ట్ ఫ్యాక్టరీ సీజ్.. 130 కిలోల పేస్ట్‌ స్వాధీనం..

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions