Site icon NTV Telugu

BJP Shiva Prakash : బీజేపీలో చేరికలపై దృష్టి పెట్టాలి : శివ ప్రకాష్

Bjp

Bjp

తెలంగాణ బీజేపీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ ముఖ్యనేతలు సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో సంస్థాగత సహా ప్రధాన కార్యదర్శి శివ ప్రకాష్ మాట్లాడుతూ.. పార్టీలో చేరికలుపై చర్చించి.. ప్రత్యేక దృష్టి పెట్టాలని.. ఎందుకు ఆగిపోయాయని తెలంగాణ బీజేపీ నేతలను ప్రశ్నించారు. సంజయ్ పాద యాత్రతో పాటు సమాంతరంగా ఇతర కార్యక్రమాలు కూడా చేయాలని, ముఖ్య నేతలు ఇతర కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆయన సూచించారు. స్థానిక , సామాజిక, సంస్థాగత అంశాల పై దృష్టి పెట్టాలని, ఎస్సీ, ఎస్టీ నియోజక వర్గాల్లో ఇప్పటి వరకు చేసిన కార్యక్రమాలును శివ ప్రకాష్‌కు నేతలు వివరించారు. నేతలు సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేసుకోవద్దని, ప్రభుత్వ ప్రజా వ్యతరేక విధానాలుపై మాత్రమే స్పందించాలన్నారు. కొత్తవారికి పనులు అప్పగించాలన్నారు.

అంతేకాకుండా 26 న రాష్ట్రానికి ప్రధాని మోడీ రానున్నారని, ఆ రోజు మధ్యాహ్నం బేగం పేట ఎయిర్‌పోర్టుకు మోడీ చేరుకుంటారని ఆయన వెల్లడించారు. అక్కడ బీజేపీ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడే అవకాశం ఉందని ఆయన తెలిపారు. 20 వేల మందితో ఎయిర్‌పోర్ట్‌లో స్వాగతం పలకాలని బీజేపీ నిర్ణయం తీసుకుంది. అయితే.. బేగం పేట ఎయిర్‌పోర్ట్‌ నుండి సెంట్రల్ యూనివర్సిటీ కి హెలి కాప్టర్ లో మోడీ వెళ్లనున్నారు. సెంట్రల్ యూనివర్సిటీ నుండి ఐఎస్‌బీకి రోడ్డు మార్గాన ప్రధాని వెళ్తారు. ఐఎస్‌బీ కార్యక్రమంలో పాల్గొని, ఐఎస్‌బీలో గంట సేపు ప్రధాని మోడీ ఉండనున్నారు.

Exit mobile version