హామీలను అటకెక్కించడమే టీఆర్ఎస్ నేతలు చేసే పని : బీజేపీ నేత ఎస్.కుమార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ప్రకాశ్ రెడ్డితో కలిసి బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్ ఈరోజు జూమ్ వీడియో కాన్ఫరెన్సు ద్వారా మీడియాతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్.కుమార్ మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ పై మంత్రులు, టీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. బీజేపీ వైపు వేలు చూపించే ముందు టీఆర్ఎస్ నేతలు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక దళిత, గిరిజనుల బతుకులు ఏం మారాయో టీఆర్ఎస్ నేతలు జవాబు చెప్పాలన్నారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలు ఎదుర్కొంటున్న సమస్యలపై బండి సంజయ్ సహా బీజేపీ నేతలు ప్రభుత్వ తీరును ఎండగడుతుంటే భరించలేక బీజేపీ బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
ఎస్సీ, ఎస్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు తమ పదవుల కోసం… సీఎం మెప్పు పొందేందుకు బానిసలుగా బతుకున్నారన్నారు. ‘దళిత బంధు’ సంగతి ఏమైంది? ఈ పథకం కోసం డిపాజిట్ చేసిన రూ.1600 కోట్లు 4 నెలలైనా ఎందుకు లబ్దిదారుల ఖాతాల్లోకి మళ్లించలేదు? అని ఆయన ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో దళిత నియోజకవర్గాల్లో గెలిచిన 16 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు డిపాజిట్ కూడా దక్కదని ఆయన జ్యోస్యం చెప్పారు. సీఎం నిర్వహించిన సర్వేల్లోనూ ఈ విషయం తేలిపోయిందని, అంబేద్కర్ జయంతి, వర్దంతిసహా ఏ ఒక్క కార్యక్రమానికి హాజరుకాని సీఎంను ఏనాడైనా దళిత టీఆర్ఎస్ నేతలు నిలదీశారా? అని ఆయన విమర్శించారు.
Also Read
- KTR : పదవుల్లో ఉన్న వారికంటే ప్రజల బలమే గొప్పది.. జెన్-జీకి కేటీఆర్ సెల్యూట్
- Shubhakshetra Fraud: శుభాక్షేత్ర మోసం.. మరో కీలక నిందితుడు అరెస్ట్.!
- Minister Seethakka : ఎల్ నీనో ఎఫెక్ట్‌పై సీతక్క అలర్ట్.. తెలంగాణలో తాగునీటి కొరతకు నో ఛాన్స్
- Thatikonda Rajaiah : కడియం శ్రీహరి సొల్లు పురాణం చెబుతున్నారు
తాజావార్తలు
-
Pralhad Joshi: ధర్మేంద్ర ప్రధాన్ వారసుడిగా ప్రహ్లాద్ జోషి.. కొత్త విద్యాశాఖ మంత్రిగా నియామకం
-
Shreyas Iyer: ఆ ఇద్దరు అద్భుతం చేశారు.. గుడ్‌న్యూస్‌తో పాటు బ్యాడ్‌న్యూస్ కూడా చెప్పిన శ్రేయస్ అయ్యర్..
-
Kanaka Durga Temple: జులై 27 నుంచి ఇంద్రకీలాద్రిపై శాకంబరీ ఉత్సవాలు.. రేపు వీఐపీ దర్శనాలు రద్దు..
-
Indai: దేశ చరిత్రలో రాజీనామాలు చేసిన కేంద్రమంత్రులు ఎవరంటే..!
-
KTR : పదవుల్లో ఉన్న వారికంటే ప్రజల బలమే గొప్పది.. జెన్-జీకి కేటీఆర్ సెల్యూట్
ట్రెండింగ్
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్‌స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!