Site icon NTV Telugu

JP Nadda – Nithin meet: జేపీ నడ్డాతో నితిన్‌ భేటీ.. ఇలా స్పందించిన బీజేపీ నేత

Ramachandra Rao

Ramachandra Rao

ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు భారతీయ జానతా పార్టీ జాతీయ కార్యదర్శి జేపీ నడ్డా… మొదట శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు రానున్న ఆయన.. ఎయిర్‌పోర్ట్‌ సమీపంలోని నోవాటెల్‌ హోటల్‌కు దాదాపు గంటకుపై గా ఉంటే.. మధ్యాహ్నం ఒంటి గంటకు శంషాబాద్ లో బీజేపీ జాతీయ అధ్యక్షులు, ఎంపీ జేపీ నడ్డాతో భారత మహిళా క్రికెటర్, మాజీ కెప్టెన్ మిథాలీరాజ్ సమావేశం కానున్నారు.. బీజేపీ ముఖ్యనేతలతో కూడా సమావేశం కానున్న జేపీ నడ్డా.. రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై చర్చించను్నారు.. ఇక, మధ్యాహ్నం 3.45 గంటలకు వరంగల్ బాలసముద్రంలోని తెలంగాణ ఉద్యమకారుడు ప్రొఫెసర్ వెంకటనారాయణ నివాసానికి వెళ్లనున్నారు జేపీ నడ్డా, బండి సంజయ్.. ఆ తర్వాత హన్మకొండలో భారీ బహిరంగసభలో పాల్గొంటారు..

Read Also: Bandi Sanjay: భద్రకాళి సన్నిధిలో ముగియనున్న బండి సంజయ్‌ పాదయాత్ర.. భారీ బహిరంగ సభకు ముమ్మర ఏర్పాట్లు..

బీజేపీ చీఫ్‌ జేపీ నడ్డా తిరిగి శంషాబాద్‌ చేరుకున్న తర్వాత రాత్రి 7.30 గంటలకు శంషాబాద్ నోవాటెల్ హోటల్ లో ఆయనతో సమావేశం కానున్నారు సినీ నటుడు నితిన్.. అయితే, మునుగోడు బహిరంగసభ కోసం హైదరాబాద్‌ వచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా.. అప్పుడు టాలీవుడ్‌ యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ను కలవడం రాజకీయ చర్చకు దారి తీసింది.. ఇప్పుడు నితిన్‌తో జేపీ నడ్డా భేటీ ఉంది.. ఇలా వరుసగా సమావేశాలపై స్పంచిందిన బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు.. జేపీ నడ్ తో సినిమా వాళ్ల భేటీకి పెద్దగా రాజకీయ ప్రాధాన్యత లేదని.. కలవాలని వాళ్లు అనుకున్నారు.. కలుస్తారు అని స్పష్టం చేశారు. ఇక, ప్రభుత్వం హన్మకొండలో బీజేపీ బహిరంగ సభను అడ్డుకోవాలని చూసిందని.. కోర్టు ఆదేశాల ప్రకారం సభ నిర్వహిస్తున్నామని తెలిపారు రామచందర్‌రావు.

Exit mobile version