Site icon NTV Telugu

NVSS Prabhakar : నిబంధనలు అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి వర్తించవా

Trss

Trss

టీఆర్‌ఎస్‌ పార్టీ ప్లీనరీ సమావేశాల నేపథ్యంలో హైదరాబాద్‌ ప్రధాన కూడల్లో టీఆర్‌ఎస్‌ ఫ్లెక్సీలు వెలిశాయి. అయితే హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్‌వీసీసీ ప్రభాకర్. ఇతర రాజకీయ పార్టీలు కడితే ఫైన్ లు వేస్తారు… కేసులు పెడతారని, అవే నియమ నిబంధనలు అధికార పార్టీ కి వర్తించవా అని ఆయన ప్రశ్నించారు. పురపాలక శాఖ అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహారిస్తున్నారన ఆయన మండిపడ్డారు.

వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి హయాంలో పని చేసిన అధికారుల పరిస్థితి ఏందో తెలుసు కదా అని ఆయన వ్యాఖ్యానించారు. చట్టం ఎవరికైనా చట్టమేనని, ప్లీనరీలో ప్రభుత్వ వైఫల్యాలపై కూడా తీర్మానం చేయాలన్నారు. అవినీతి, అక్రమాలు,ఆక్రమణలు, హత్యలు, అత్యాచారాల పై కూడా తీర్మానం చేయాలన్నారు. 21 సంవత్సరాలలో టీఆర్‌ఎస్‌ వేసిన తప్పటడుగులపై ప్లీనరీలో ఆత్మవలోకనం చేసుకోవాలని ఆయన విమర్శించారు. 111జీవో పరిధిలో జరిగిన అక్రమాలకు కారణం తండ్రి, కొడుకులేనని ఆయన ఆరోపించారు.

Exit mobile version