Site icon NTV Telugu

Muralidhar Rao: తెలంగాణ దేశంలో ఉందా? పాక్‌లోనా..? శివాజీకి జై అంటే నేరమా..?

తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌, ఎంఐఎం పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ సీనియర్‌ నేత, మధ్యప్రదేశ్‌ ఇంఛార్జ్‌ మురళీధర్‌రావు.. బోధన్‌లో నెలకొన్ని పరిస్థితులు, బంద్‌.. తదితర అంశాలపై మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలంగాణ.. భారత దేశంలో ఉందా..? లేక పాకిస్థాన్‌లో ఉందా..? అని నిలదీశారు.. కేసీఆర్ తన మహారాష్ట్ర పర్యటనలో ఛత్రపతి శివాజీని పొగిడారు.. కానీ, నిన్న బోధన్‌లో శివాజీ విగ్రహం అంశంలో టీఆర్ఎస్‌, ఎంఐఎం కలిసి హిందువులపై దాడి చేశాయని ఆరోపించారు.. ఇక, దాడులకు గురైనవారిపైనే కేసులు పెట్టారు అని విమర్శించిన ఆయన.. ఛత్రపతి శివాజీకి జై అంటే నేరమా? అని మండిపడ్డారు. హైదరాబాద్ నుండి ఆదిలాబాద్ వరకు ఇస్లాం కారిడార్, టెర్రర్ కారిడార్‌ని ఎంఐంఎ ఏర్పాటు చేస్తుందని సంచలన ఆరోపణలు చేసిన మురళీధర్‌రావు.. ప్రభుత్వం, పోలీసులు వారికి సహకరిస్తున్నారని ఫైర్‌ అయ్యారు.

Read also: Minister Botsa: పన్నులు కట్టకపోతే ఆస్తుల జప్తు.. ఇవాళ కొత్తగా వచ్చిందా..?

కేసీఆర్ అసెంబ్లీలో మూర్ఖంగా, అబద్దాలు మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు మురళీధర్‌రావు.. హిందువుల గురించి మాట్లాడితే మతపిచ్చా..? అని ప్రశ్నించిన ఆయన.. బాధ్యత రహితంగా మాట్లాడితే ఖబడ్దార్ కేసీఆర్ అంటూ హెచ్చరించారు.. ముస్లిం మతోన్మాదానికి, ఉగ్రవాద కార్యకలాపాలకు కారణం కేసీఆర్, ఆయనే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు.. ఇక, బెంగళూరుకి వచ్చినన్ని పెట్టుబడులు హైదరాబాద్‌కి ఎందుకు రాలేదు..? అని నిలదీశారు.. హిందువుల పలాయనం హైదరాబాద్‌లో నడుస్తోందన్న ఆయన.. పాత బస్తీలో హిందువుల సంఖ్య ఎందుకు తగ్గింది? అని ప్రశ్నించారు.. హైదరాబాద్ ఫైల్స్ తీసుకోస్తాం… వదిలి పెట్ట అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత.. రోహింగ్యాలకు ఆధార్, రేషన్ కార్డులు ఇవ్వడానికే తెలంగాణ హోం మంత్రి ఉన్నారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. మరోవైపు, కాశ్మీర్ ఫైల్స్‌పై రాహుల్ గాంధీ, కేసీఆర్ ఎందుకు మాట్లాడడం లేదు? అని నిదీశారు మరళీధర్‌రావు.. కాశ్మీర్ ఫైల్స్ ని ప్రశ్నిస్తే మాడి మసై పోతారన్న ఆయన.. కాశ్మీర్ ఫైల్స్ కి హైదరాబాద్ కి సంబంధం ఉందన్నారు. కాశ్మీర్‌కి రక్షణ లేక పోతే తెలంగాణకు కూడా లేనట్లేనని పేర్కొన్నారు. ఇక, చరిత్రలో కేసీఆర్‌కి శిక్ష మాములుగా ఉండదంటూ హెచ్చరించారు మురళీధర్‌రావు.

Exit mobile version