NTV Telugu Site icon

Jithender Reddy: హస్తం గూటికి మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి.. ఆ వెంటనే కేబినెట్ హోదా..!

Jithender Reddy

Jithender Reddy

Jithender Reddy: తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పార్లమెంట్ ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తుండగా.. పలు కీలక పార్టీలు మారుతున్నాయి. ఈ క్రమంలో లోక్‌సభ ఎన్నికల సమయంలో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ నేత, మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. బీజేపీ నుంచి మహబూబ్‌నగర్ ఎంపీ టికెట్ ఆశించి నిరాశచెందిన ఆయన తన కుమారుడు మిథున్‌రెడ్డితో కలిసి నిన్న (శుక్రవారం) కాంగ్రెస్‌లో చేరారు. సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపదాస్ మున్షీ సమక్షంలో ఆయన చేతులు కలిపారు. కాంగ్రెస్‌లో చేరిన వెంటనే జితేందర్‌రెడ్డికి కేబినెట్ హోదాతో కూడిన రెండు పదవులు కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా, రాష్ట్ర ప్రభుత్వానికి క్రీడా వ్యవహారాల సలహాదారుగా నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జూరీ చేసంది. కాగా.. కాంగ్రెస్ పార్టీలో చేరే ముందు ఆయన తన రాజీనామా లేఖను బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాకు పంపారు. లేఖలో ఆయన పార్టీ మారడానికి గల కారణాలను లేఖలో వివరించారు.

Read also: Uttarpradesh : తమ్ముడు, అతడి భార్య వేధింపులు భరించలేక ప్రైవేట్ పార్టు కోసుకున్న వ్యక్తి

అయితే.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ ఉండగా.. రాష్ట్రంలో ఆ పార్టీ బలపడి రాజకీయ శక్తిగా మారిందని లేఖలో పేర్కొన్నారు. కాగా.. రాష్ట్రంలో నాయకత్వం మారిన తర్వాత బీజేపీకి తీవ్ర నష్టం వాటిల్లిందని, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 25 సీట్లకు గాను 8 సీట్లకే పరిమితమైందని అన్నారు. అయితే.. ఇన్నాళ్లూ బీజేపీలో పనిచేసేందుకు అవకాశం ఇచ్చినందుకు ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డాలకు ధన్యవాదాలు తెలిపారు. తాజాగా.. బీజేపీ తన పార్లమెంటు అభ్యర్థులను ప్రకటించినప్పుడు, మహబూబ్ నగర్ స్థానానికి అభ్యర్థిగా డికె అరుణను ఎంపిక చేశారు. ఈ స్థానం నుంచి జితేందర్ రెడ్డి పోటీ చేయాలని భావించగా, డీకే అరుణపై హైకమాండ్ మొగ్గు చూపింది. దీంతో జితేందర్ రెడ్డి తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఈనేపథ్యంలో.. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా జితేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి పార్టీ మార్పుపై చర్చించారు. దీంతో.. కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని చెప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆహ్వానం మేరకు జితేందర్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ పార్టీలో చేరిన వెంటనే.. కేబినెట్ హోదాతో కూడిన పదవులు కాంగ్రెస్ అధిష్టానం వెల్లడించడం గమనార్హం.
RS Praveen Kumar: కవిత అరెస్ట్‌పై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్

Show comments