బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌లో జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశాలకు ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. అయితే బీజేపీ జాతీయ కార్య వర్గసమావేశాల్లో స్టేట్ ఇంటిలిజెన్స్ పోలీసులు కనిపించడంతో బీజేపీ శ్రేణులు అలర్ట్ అయ్యారు. స్టేట్ ఇంటెలిజెన్స్ పోలీస్ ల పేరుతో..మా సమావేశం లోని పత్రాలను ఫోటోలు తీశారని పట్టుకొని బయటకు పంపించామని బీజేపీ సీనియర్ నాయకులు ఇంద్రసేనారెడ్డి వెల్లడించారు.
Jagga Reddy : రేపు సంచలన నిర్ణయం తీసుకుంటా
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం మా ప్రైవసీనీ దెబ్బతీయాలని చూసారన్నారు. వారిని పోలీస్ కమిషనర్ అప్పజెప్పామని వెల్లడించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు వచ్చిన నిఘాధికారి శ్రీనివాసరావును పట్టుకోవడం జరిగిందని, లోపల కార్యక్రమాలకు సంబంధించిన షెడ్యూల్ బుక్ ను ఫోటో తీసే ప్రయత్నం చేశారన్నారు. ఫోటోలన్నిటినీ డిలీట్ చేయించామనన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి తగిన చర్య కాదని ఆయన విమర్శించారు. అంతర్గత సమావేశంలోకి పోలీసులను పంపించి నిఘా పెట్టడం అనేది మంచి పద్ధతి కాదన్నారు. గతంలో మీరు సమావేశ నిర్వహించుకున్నప్పుడు ఎవరు ఇలా చేయలేదన్నారు.
