Site icon NTV Telugu

దమ్ముంటే మీ సిద్ధాంతం చెప్పుకో.. ఘర్షణకు పాల్పడితే సహించం

Etela Rajender

Etela Rajender

దమ్ముంటే మీ సిద్ధాంతం చెప్పుకో.. కానీ, ఘర్షణకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు మాజీ మంత్రి ఈటల రాజేందర్.. హుజురాబాద్‌ నియోజకవర్గంలోని వీణవంక మండలం చల్లూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన మండల ముఖ్యకార్యకర్తలు సమావేశానికి హాజరైన బీజేపీ నేత ఈటల.. ఈసందర్భంగా మాట్లాడుతూ.. వీణవంక మండలంలో అక్కడొక దొర, ఇక్కడొక దొర ఉన్నారని ఎద్దేవా చేశారు.. మేం ఎవరి జోలికి వెళ్లం.. ఈ 20ఏళ్లలో ఎప్పుడు గొడువలకు తావు ఇవ్వలేదని.. ఎప్పుడైన శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించకునేదన్నారు.. మీకు దమ్ముంటే మీ సిద్దాంతం చెప్పుకో, కానీ ఘర్షణలకు పాల్పడుతామంటే మాత్రం సహించేది లేదన్నారు..

హుజురాబాద్ లో ఎన్నికలు జరిగినప్పుడు ప్రలోభాలు, లిక్కర్ పంపిణీలకు తాము ఎప్పుడు పాల్పడలేదన్నారు ఈటల.. కుల సంఘాల మీటింగులు పెట్టి, అంగట్లో మాదిరిగా అందరిని కొంటున్నారని విమర్శించిన ఆయన.. కేసీఆర్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారు అంటున్నారు.. మరి.. టీఆర్ఎస్‌లో సరిపడ ఎమ్మెల్యేలు ఉన్నా ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఎందుకు చేర్చుకున్నావో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల సమయంలో మాత్రమే నిధులు, రేషన్ కార్డులు, పెన్షన్లు ఇస్తామని చెప్పడం బాధాకరమన్న మాజీ మంత్రి.. నియోజక వర్గంలో రెండున్నర ఏళ్లుగా రేషన్ కార్డులు, పెన్షన్లు ఇవ్వలేదు.. కానీ, ఇప్పుడు ఇస్తా అని చెబుతున్నారు.. దీనినే చిల్లర రాజకీయం అంటారని మండిపడ్డారు.ఇక, ఐఏఎస్‌ లాంటి అధికారులు కూడ నీకు బానిసలుగా చేసుకున్నావని సీఎం కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఈటల.. బానిసలుగా మారితెనే పదవులు వస్తాయనే దౌర్భాగ్య పరిస్థితి తెలంగాణలో కల్పించారని ఫైర్ అయ్యారు. వీణవంక మండలం లో 90శాతం ఓట్లు బిజెపికి పడేటట్లు కృషి చేయాలని సూచించారు ఈటల.

Exit mobile version