Site icon NTV Telugu

BJP National Executive Meeting: బీజేపీ స‌భ‌లో ఇంటెలిజెన్స్ పోలీసుల హ‌ల్ చ‌ల్‌

Bjp Intelijents

Bjp Intelijents

న‌గ‌రంలో రెండో రోజు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు అట్ట హాసంగా జ‌రుగుతున్నారు. అయితే బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాల్లో భద్రతా లోపం బయటపడింది. బీజేపీ కార్యవర్గ సమావేశంలోకి తెలంగాణ ఇంటెలిజెన్స్ పోలీసులు రహస్యంగా వెళ్లారు.

అంతేకాకుండా.. ఇంటెలిజెన్స్ సీఐ శ్రీనివాస్ లోపలికి వెళ్లి రహస్యంగా ఫొటోలు తీస్తుండగా బీజేపీ నేత ఇంద్రాసేనా రెడ్డి అడ్డుకున్నారు. ఎందుకు ఫోటోలు తీస్తున్నార‌ని ప్ర‌శ్నించి వారిని బయటకు పంపారు. స‌మావేశం అజెండా.. తీర్మానం కాపీల ఫొటోలను తీసేందుకు ప్రయత్నించినట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు. అయితే.. వీరిని పోలీస్ అధికారిని సీపీకి అప్పగించారు బీజేపీ శ్రేణులు. కాగా..ఇంటెలిజెన్స్ అధికారుల తీరుపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Y. S. Sharmila: కాళేశ్వరం ప్రాజెక్ట్ లో 70 వేల కోట్ల అవినీతి..

Exit mobile version