NTV Telugu Site icon

Bandi sanjay: పొంగులేటితో ఈటల బృందం భేటీ.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

Bandi Snajay

Bandi Snajay

Bandi sanjay: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏ పార్టీలో చేరుతారనే ఉత్కంఠ కొనసాగుతోంది. పొంగులేటి బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో ఏదో ఒక పార్టీలో చేరతారని స్పష్టమైనప్పటికీ ఆయన ఏ పార్టీలో చేరుతారనేది ఆయన అభిమానులతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర అంశంగా మారింది. ఈనేపథ్యంలో ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో బీజేపీ నేతలు ఇవాల భేటీ కానున్నారు. దీంతో ఆయన బీజేపీలో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. పొంగులేటి బీజేపీలో చేరతారనే ప్రచారంపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీలోకి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తామని చెప్పారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో ఈటల టీమ్ భేటీపై తనకు ఎలాంటి సమాచారం లేదన్నారు. ఆ విషయం తనకు చెప్పకపోవటంలో తప్పేమీ లేదన్నారు. పార్టీలో తమ పని తాము చేసుకుంటామన్నారు. తనకు తెలిసిన వారితో మాట్లాడుతున్నానని బండి సంజయ్ చెప్పాడు. పొంగులేటి గురించి చెప్పకపోవడంలో తప్పు లేదన్నారు. తన వద్ద ఫోన్ లేదని, సమాచారం లేదని వ్యాఖ్యానించారు.

Read also: Alwal Crime: అల్వాల్‌లో సాప్ట్‌వేర్ ఉద్యోగిని హల్ చల్‌.. కొత్తకారుతో భీభత్సం

కాగా. బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ తన సహచరులతో ఆంతరంగిక సమావేశాలు నిర్వహిస్తూ సీఎం కేసీఆర్ పై పొంగులేటి విమర్శలు గుప్పిస్తున్నారు. గత నెల మొదటి వారంలో కొత్తగూడెంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొని సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేశారు. దీంతో వారిద్దరినీ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఏప్రిల్ 10న పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. బీఆర్‌ఎస్‌ నుంచి సస్పెన్షన్‌కు గురైన పొంగులేటి కాంగ్రెస్‌, బీజేపీలో చేరడం ఎప్పటి నుంచో ప్రశ్నగా మిగిలిపోయింది. పొంగులేటిని ఇరువర్గాలు ఆహ్వానిస్తున్నాయి. ఇప్పటికే పొంగులేటితో బీజేపీ రిక్రూట్‌మెంట్ కమిటీ టచ్‌లో ఉంది. గత నెలలో అమిత్ షా పర్యటన సందర్భంగా పొంగులేటి బీజేపీలో చేరతారని ప్రచారం జరిగింది. ఇప్పటికే పొంగులేటితో రాహుల్ గాంధీ బృందం చర్చలు జరిపింది. కాంగ్రెస్ పార్టీలో చేరితే పెద్దఎత్తున చేస్తానని పొంగులేటి హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలోనే పొంగులేటి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అవి కార్యరూపం దాల్చలేదు.

Read also: Hyderabad Crime: అప్పు ఇచ్చి అడినందుకు దారుణం.. హైకోర్టు ముందే హత్య

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీజేపీకి పెద్దగా పట్టులేదు. ఆ జిల్లాలో బీజేపీ బలోపేతానికి పొంగులేటి లాంటి నేతలు అవసరమని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఆయన్ను పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో గురువారం పొంగులేటితో బీజేపీ చేరికల కమిటీ సభ్యులు భేటీ కానున్నారు. ఈటెల రాజేందర్‌ ఆధ్వర్యంలో శ్రీనివాస్‌రెడ్డి ఇంట్లో మధ్యాహ్న భోజన సమావేశానికి సభ్యత్వ కమిటీ సభ్యులు కొండా విశ్వేశ్వర రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, రఘునందన్‌రావు, మరికొందరు బీజేపీ నేతలు హాజరుకానున్నారు. పొంగులేటిని బీజేపీలో చేరాలని కోరడంతో పాటు.. పార్టీలో చేరితే ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారనే దానిపై కూడా క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. వీరి భేటీతో పొంగులేటి ఏ పార్టీలో చేరుతారనేది తేలిపోతుందని, ఆయన బీజేపీలో చేరడం దాదాపు ఖాయమని పొంగులేటి అనుచరులు అంటున్నారు.
Allari naresh: కామెడీ చేసేవాళ్లంటే చిన్న చూపు