Eatala Rajender: బీజేపీ ఎమ్మెల్యే ఇంట విషాదం.. అనారోగ్యంతో తండ్రి మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
bjp huzurabad mla eatala rajender father passes way: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి ఈటల మల్లయ్య అనారోగ్య సమస్యలతో మంగళవారం రాత్రి కన్నుమూశారు. ఆయన వృద్ధాప్య సమస్యలతో చాలా రోజులుగా ఈటల మల్లయ్య బాధపడుతున్నారు. దీంతో తండ్రిని, కుమారుడు ఈటల రాజేందర్ హైదరాబాద్ లోని ఆర్వీఎం ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అయినా.. ఆరోగ్యం పూర్తిగా విషమించడంతో నిన్న మంగళవారం రాత్రి ఆయన కన్నుమూశారు. తండ్రి మల్లయ్య మరణవార్తను ఈటల రాజేందర్ కుటుంబ సభ్యులు ధృవీకరించారు.
నిన్న మంగళవారం అర్ధరాత్రి ఆయన భౌతిక కాయాన్ని హనుమకొండ జిల్లా కమలాపూర్‌లని ఈటల స్వగృహానికి తరలించారు. నేడు మధ్యాహ్నం 12 గంటల సమయంలో అంత్యక్రియలు నిర్వహిస్తామని ఈటల కుటుంబీకులు తెలిపారు. తండ్రి ఈటల మల్లయ్యకు మొత్తం ఎనిమిది మంది సంతానం.. ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు. కాగా.. ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రెండో కుమారుడు.. ఈటల మల్లయ్య మృతితో కమలాపూర్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈటెల మల్లయ్యను కడసారి చూసేందుకు.. ఈటలను పరామర్శించేందుకు బీజేపీ కార్యకర్తలు తరలి వస్తున్నారు.
Also Read
మునుగోడు ఉపఎన్నికల నేపథ్యంలో ఈటల రాజేందర్ బిజీబిజీగా ఉన్నారు. దీంతో కొన్ని రోజులుగా మునుగోడు నియోజకవర్గంలోనే మకాం వేసి క్షేత్ర స్థాయిలో పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఇక బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ హోదాలో వలసలపై సీరియస్‌గా దృష్టిసారించారు.. కలిసి వచ్చే వారందరినీ పార్టీలో చేర్చుకుంటున్నారు. ఈనేపథ్యంలో.. ఈటల రాజేందర్ భార్య జమున స్వగ్రామం మునుగోడు నియోజకవర్గంలోనే ఉండడంతో ఆయన అక్కడే స్వయంగా అక్కడే ఉండి.. ఉపఎన్నికల కోసం పనిచేస్తున్నారు. ఇక తండ్రి ఆరోగ్యం పూర్తిగా విషమించడంతో నిన్న మంగళవారం అంతా ఆయన ఆస్పత్రిలోనే ఉన్నట్లు తెలుస్తోంది. నిన్న (మంగళవారం) రాత్రి తన తండ్రి మరణించడంతో స్వగ్రామానికి వెళ్లి.. అంత్యక్రియలు నుంచి దశదిన కర్మ వరకు అక్కడే ఉండనున్నారు. అనంతరం.. ఆ తర్వాతే మళ్లీ రాజకీయపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలుస్తోంది.
Bihar Politics: నేడు నితీష్ కుమార్ సర్కార్ బలనిరూపణ పరీక్ష
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..