Kalvakuntla Kavitha: బీఆర్ఎస్ పార్టీ ప్రకటన.. బీజేపీని గడగడలాడించింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP Feeling Uncomfortable After KCR Announced BRS Party Says Kalvakuntla Kavitha: సీఎం కేసీఆర్ చేసిన ‘బీఆర్ఎస్’ పార్టీ ప్రకటన బీజేపీను గడగడలాడించిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. బీజేపీ ఎత్తుగడలను ప్రజలు తిప్పికొట్టి.. తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. విద్వేషాన్ని ప్రోత్సహించడం, మతాల మధ్య చిచ్చు పెట్టడం వంటివి టీఆర్ఎస్ సైన్యం వద్ద పనిచేయవని తేల్చి చెప్పారు. తెలంగాణ ప్రజల శ్రేయస్సుకు తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. తెలంగాణ ప్రజలకు సేవ చేయడాన్ని తమను ఏ శక్తి ఆపలేదని చెప్పారు.
అంతకుముందు.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు రిమాండ్ రిపోర్టులో ఈడీ తన పేరుని జోడించిన విషయంపై కవిత స్పందించారు. ఏ రాష్ట్రంలో అయితే ఎన్నికలు జరగాల్సి ఉంటే.. అక్కడికి మోడీ కంటే ముందు ఈడీ వస్తుందని దుయ్యబట్టారు. వచ్చే ఏడాది డిసెంబర్లో ఎన్నికల ఉండటం వల్లే.. తెలంగాణలో ఈడీ కేసులు పెడుతున్నారని విమర్శించారు. నీచమైన ఎత్తుగడుతో బీజేపీ తనతో పాటు టీఆర్ఎస్ మంత్రులు, ఎంపీల మీద ఈడీ కేసులు పెడుతోందని మండిపడ్డారు. ఈ కేసులతో తాము భయపడేదే లేదని.. ఎటువంటి విచారణనైనా ఎదుర్కుంటామని అన్నారు. ఏజేన్సీలు ప్రశ్నిస్తే.. తాము తప్పకుండా సమాధానం చెప్తామన్నారు.
Also Read
- CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
- CM Revanth Reddy : ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య భవన్.. రేవంత్ కీలక వ్యాఖ్యలు
మోడీ అధికారంలోకి వచ్చి 8 ఏళ్లు అవుతోందని, ఈ కాలంలో 9 రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యయుతంగా ఎంపికైన ప్రభుత్వాల్ని కూల్చి, బీజేపీ అధికారంలోకి వచ్చిందని కవిత చెప్పారు. మోడీ తన పంథాను మార్చుకోవాలని, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల వద్దకు వెళ్లి, ఎన్నికల్లో గెలవాలని హితవు పలికారు. అలా కాకుండా ఈడీలను, సీబీఐలను ప్రయోగించి గెలవలానుకుంటే.. తెలంగాణలో సాధ్యపడదని అన్నారు. ప్రజలు తమ వెంట ఉన్నంతవరకు.. చిత్తశుద్ధితో పని చేస్తున్నంత కాలం.. తమకు ఎలాంటి ఇబ్బంది రాదని కవిత చెప్పారు.
తాజావార్తలు
-
Tharun – Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ – ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
-
Ajit Agarkar-BCCI: బీసీసీఐ కీలక సమావేశం.. అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఉత్కంఠ!
-
Sanju Samson: సంజు శాంసన్.. ముందుంది ముసళ్ల పండగ! అంతా నీచేతుల్లోనే ఇగ!
-
CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
-
Oppo Find X10: ఒప్పో Find X10 సిరీస్‌లో మూడు మోడల్స్.. గ్లోబల్ లాంచ్‌కు సిద్ధం.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!