Bandi Sanjay: సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీలను బంగాళాఖాతంలో కలిపేయాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం ఉండగానే.. ఇరు పార్టీలు తెలంగాణలో ఎన్నికల తరహా వాతావరణాన్ని తీసుకువచ్చాయి. తాజాగా తెలంగాణ ఏర్పాటు దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇరు పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. తెలంగాణ డెవలఫ్‌మెంట్ కు కేంద్రం మోకాలడ్డు పెడుతుందని టీఆర్ఎస్ అంటుంటే.. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కప్పగా మార్చారంటూ బీజేపీ ఫైర్ అవుతోంది.
ఇదిలా ఉంటే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ను విమర్శించారు. మూర్ఖపు ముఖ్యమంత్రిని టీఆర్ఎస్ పార్టీని బంగాళాఖాతంలో కలిపేయాలని అన్నారు. నిజమైన ఉద్యమకారులు ఉన్న పార్టీ బీజేపే అని ఆయన తెలిపార. ఛత్రపతి శివాజీ,చాకలి ఐలమ్మను ఎవరూ చూడలేదు.. కానీ ఉద్యమకారుల రూపంలో వారిని మనం చూస్తున్నామని బండి సంజయ్ అన్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు అంతా ఉద్యమ ద్రోహులే అని తీవ్రస్థాయిలో విమర్శించారు.
Also Read
- CM Revanth Reddy : బుల్లెట్ ట్రైన్ ల్యాండ్ అక్విజిషన్, టీ-ఫైబర్ పై సీఎం రేవంత్ డెడ్‌లైన్.!
- CM Revanth Reddy : నెట్ జీరో సిటీగా 'భారత్ ఫ్యూచర్ సిటీ'.. ఇన్వెస్టర్ల కోసం ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ సెల్.!
- Weather Updates : తెలంగాణలో ఠారెత్తిస్తున్న ఎండలు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Hyderabad Metro Phase 2: హైదరాబాద్ మెట్రో రెండో దశకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..
తెలంగాణ ప్రజలు తెలంగాణ ఎందుకు సాధించామా..అని బాధపడుతున్నారని దానికి కారణం కేసీఆరే అని ఆరోపించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఆత్మహత్యలు ఆగలేని అన్నారు. ఇంటర్ విద్యార్థులు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపురించిందని బండి విమర్శలు గుప్పించారు. ప్రజల తరుపున మరో ఉద్యమం చేస్తాం.. అదే చివరి ఉద్యమం కావాలని అన్నారు. ప్రజలు తరుపున బీజేపీ పోరాడుతుందని.. శక్తివంతమైన తెలంగాణను నిర్మిస్తామని అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చే పార్టీ బీజేపీ అని అన్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన తెలంగాణ ఉద్యమకారులు ఆదే స్ఫూర్తితో ముందుకు సాగుదాం.. పోరాడుదాం అని పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Prashanth Neel : ఎన్టీఆర్ బక్క చిక్కడం చూసి భయపడిపోయా.. ఎన్టీఆర్ భార్య కూడా నాపై సీరియస్ అయింది
-
Mamata Banerjee: మమత పార్టీలో విభేదాలు.. నిరసనకు 35 మంది ఎమ్మెల్యేలే హాజరు..
-
Modi-Meloni: గంటల్లోనే కోట్లలో వ్యూస్.. ఇంటర్నెట్లో ప్రకంపనలు రేపుతున్న మెలోడీ వీడియో
-
Lenovo Legion Y900: కొత్త టాబ్లెట్ లెనోవో లెజియన్ Y900 విడుదల..144Hz డిస్ప్లే, 12,700mAh బ్యాటరీ
-
US-Iran War: ఇరాన్ యుద్ధంలో అమెరికాకు భారీ దెబ్బ.. 42 విమానాలు ధ్వంసం..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!