BJP and TRS are playing the game to divert the liquor scam: లిక్కర్ స్కాం ని డైవర్ట్ చేయడానికే బీజేపీ, టీఆర్ఎస్ కలిసి గేమ్ ఆడుతున్నాయని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ ఆరోపించారు. రాజసింగ్ చేసిన పనితో రెండు రోజుల నుండి నగరం అతలాకుతలం అవుతోందని మండిపడ్డారు. మతమేదైనా, దేవుళ్ళని కించపరచడం తప్పుని పేర్కొన్నారు. రాజాసింగ్ వ్యాఖ్యలని ఖండిస్తున్నాఅని తెలిపారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా బీజేపీ, టీఆర్ఎస్ తమ చర్యలతో తెలంగాణని వేడెక్కిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరు ఎన్టీఆర్ సమాధి కూల్చేస్తామని అంటే.. ఇంకొకరు ఇంకో సమాధి కుల్చేస్తామని అంటున్నారని మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలు పూర్తిగా ఎన్నికల ఎజెండాలో భాగమే అంటూ వ్యాఖ్యానించారు. రెచ్చగొట్టే ఉపన్యాసాలు ఇచ్చి ఎన్నికల్లో బెన్ఫిట్ పొందుతామని అనుకుంటున్నారన్నారు. టీఆర్ఎస్, బీజేపీ, ఏంఐఏం కలిసే ఉన్నాయని ఆరోపించారు.
పాతబస్తీలో భయంకర పరిస్థితులు క్రియేట్ చేశారని, ఓల్డ్ సిటీలో ఉండే హోం మినిస్టర్ ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించారు. లిక్కర్ స్కాం ని డైవర్ట్ చేయడానికే బీజేపీ, టీఆర్ఎస్ కలిసి గేమ్ ఆడుతున్నాయని మండిపడ్డారు. మత ఘర్షణలో నాయకులు చనిపోరు..! అమాయక ప్రజలే చనిపోతారంటూ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీఅని గుర్తుచేశారు. దేవుళ్ళ పేరు పైన, హిందూ ముస్లిం పేరు పైన రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. యువకులను తప్పుదోవ పట్టిస్తూ నాయకులు పబ్బం గడుపుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. నగర వాతావరణం ప్రశాంతంగా తేవడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కలిసి ఉండాలని రాహుల్ పాదయాత్ర చేస్తుంటే… కొందరు నాయకులు ప్రజలని విడగోట్టాలని రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. హిందువుల పేరుపై రాజకీయం చేయాలని కొందరు చూస్తున్నారని ఆరోపించారు. బీజేపీ, టీఆర్ఎస్ హైదరబాద్ ప్రతిష్ఠని నాశనం చేస్తున్నాయని తీవ్రంగా మండిపడ్డారు.
Raj Gopal Reddy: చౌటుప్పల్ వరదల్లో మునిగిపోతుంటే.. సిరిసిల్ల అభివృద్దా..?
