NTV Telugu Site icon

Revanth Reddy: ఈడీ తలచుకుంటే.. కవితని గంటలోపే జైలుకి పంపొచ్చు

Revanth Reddy On Kavitha

Revanth Reddy On Kavitha

BJP and BRS Parties Playing Drama In Kavitha Episode Says Revanth Reddy: ఈడీ తలచుకుంటే.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితను గంటలోపే జైలుకి పంపొచ్చని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే.. ఇవన్నీ బీజేపీ & బీఆర్ఎస్ కలిసి ఆడుతున్న డ్రామాలని, ఇదంతా ప్రశాంత్ కిశోర్ స్ట్రాటజీ అని ఆరోపించారు. జగిత్యాలలో తన హాత్ సే హాత్ జోడో పాదయాత్రలో భాగంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కవితని జైల్లో వేయడానికి ఇంత సేపా? కవితను ఏమైనా పేరంటానికి పిలుస్తున్నారా? అని ప్రశ్నించారు. కవిత, సంతోష్, హరీవ్ రావు, కేటీఆర్‌ల దగ్గర లక్షల కోట్ల సంపద ఉందని పేర్కొన్నారు. కవితను అరెస్ట్ చేస్తే.. సీఎం కేసీఆర్ వీధుల్లోకి వచ్చి ఆందోళన చేస్తాడని అన్నారు. బీఆర్ఎస్ ఆందోళనతో బీజేపీ కూడా రోడ్డెక్కుతుందని చెప్పారు. ప్రశాంత్ కిషోర్ వ్యూహంలో భాగంగానే.. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కలిసి వ్యూహాత్మక డ్రామాలు ఆడుతున్నాయని ఆరోపణలు చేశారు. ప్రజా సమస్యలను, అదానిపై హిండర్సన్ నివేదికను పక్కదారి పట్టించేందుకు.. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఎపిసోడ్‌ని, బీఆర్ఎస్‌ని బీజేపీ తెరమీదకి తీసుకొచ్చిందని వెల్లడించారు.

Romantic Life: శృంగారానికి ముందు ఇవి తింటే.. ఇక దబిడిదిబిడే!

అంతకుముందు.. కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలోని అధికార పార్టీ బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కవిత లిక్కర్‌ స్కాంపై దర్యాప్తు చేస్తున్న ఈడీ అధికారులు.. ఎందుకు ఎలాంటి విషయాల్ని బహిర్గతం చేయడం లేదని నిలదీశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాగాంధీ పట్ల వ్యవహరించినట్లుగా.. కవితపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐ.. బీజేపీ జేబు సంస్థలుగా పని చేస్తున్నాయని ఆరోపించారు. అవినీతి ఆరోపణలు వచ్చాయని తాటికొండ రాజయ్యను మంత్రి మండలి నుంచి వెంటనే బర్తరఫ్ చేసిన కేసీఆర్.. ఇప్పుడు కవిత విషయంలో ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అడిగారు. లిక్కర్ స్కాంపై కేసీఆర్‌ మౌనపాత్ర పోషిస్తుంటే.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. కేసీఆర్‌ అవినీతిపై తాను ఫిర్యాదు చేసినా.. ఇప్పటివరకు ఎందుకు విచారణ చేపట్టలేదో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని చివరికి ప్రధానితో పాటు కేంద్రమంత్రులు చెప్తున్నా.. ఎందుకు విచారణ ఎందుకు జరిపించడం లేదో చెప్పాలన్నారు. బండి సంజయ్, కిషన్‌రెడ్డి టీవీల ముందు పేపర్ పులుల్లా రంకలేయడం కాదని.. వీటన్నింటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Pallavi Case: మా అమ్మాయిని హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు.. పల్లవి పేరెంట్స్

Show comments