మగవారికి ఎక్కువసేపు శృంగారం చేయడం కష్టం. అప్పుడు వాళ్లు ఎక్కువసేపు ఎంజాయ్ చేయడం కోసం వయాగ్రా వైపు మొగ్గు చూపుతారు. అయితే.. వయాగ్రా వల్ల కొన్ని దుష్ప్రభావాలు కలుగుతాయి.

వయాగ్రాకి బదులు కొన్ని ఆహారాలు తీసుకుంటే.. పురుషులు ఎక్కువసేపు శృంగారంలో ఎంజాయ్ చేయొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మరి ఆ ఆహారాలేంటో తెలుసుకుందామా!

అల్లం: ఇందులో స్పైసీ జింక్ ఫ్లేవర్ ఉంటుంది. ఇది శృంగారం అనుభవాన్ని పెంచుతుంది. దీనిని ఆహారంతో పాటు తీసుకున్నా, పచ్చిగా తిన్నా మంచిదే!

పుచ్చకాయ: ఇందులో సిట్రులిన్ అనే అమైనో యాసిడ్ ఉంటుంది. ఇది సెక్స్‌ను మెరుగ్గా చేస్తుంది. ఇది లైంగిక కార్యకలాపాల సమయంలో ప్రయోజనకరంగా ఉంటుంది.

మస్క్ మెలన్: ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది మిమ్మల్ని హైడ్రేట్‌గా ఉంచి, శృంగారంలో చురుగ్గా పాల్గొనేలా చేస్తుంది.

అరటిపండు: ఇందులో ఉండే పొటాషియం, సోడియం.. ఎక్కువసేపు నిద్రపోకుండా చేస్తుంది. కలయిక ముందు దీన్ని తింటే.. స్త్రీ పురుషులిద్దరూ తగినంత శక్తిని పొందుతారు.

క్యారెట్: ఇందులో కెరోటినాయిడ్స్ ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఇవి.. స్పెర్మ్ కౌంట్ పెంచడంతో పాటు ఎక్కువసేపు శృంగారంలో పాల్గొనేలా ప్రేరేపిస్తాయి.

పిస్తాపప్పు: ఒక పరిశోధనలో భాగంగా.. పిస్తా తీసుకున్న మగవారిలో అంగస్తంభన పనితీరు గణనీయంగా మెరుగుపడినట్టు, లైంగిక కోరిక చాలా రెట్లు పెరిగినట్టు నిర్ధారితమైంది.

మెంతికూర: మెంతులు హార్మోన్ నియంత్రణను మెరుగుపరుస్తాయి. ఇది పురుషుల లైంగిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతాయి.