BJP first list: బీజేపీ తొలి జాబితాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు చోటు.. బరిలోకి ముగ్గురు ఎంపీలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP first list:తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బీజేపీ ఆదివారం విడుదల చేసింది. ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు, ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి నాలుగు పార్లమెంటు స్థానాలను బీజేపీ గెలుచుకుంది. అయితే ఈరోజు బీజేపీ విడుదల చేసిన జాబితాలో బీజేపీ నుంచి ముగ్గురు ఎంపీలు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో బీజేపీకి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ ముగ్గురికి బీజేపీ మరోసారి టిక్కెట్లు కేటాయించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన రాజా సింగ్ ఒక్కరే విజయం సాధించారు. దుబ్బాక అసెంబ్లీ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన రఘునందన్ రావు విజయం సాధించారు. హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఈటల రాజేందర్ విజయం సాధించారు. 2022లో మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై విధించిన సస్పెన్షన్‌ను బీజేపీ ఈరోజు ఎత్తివేసింది.
తెలంగాణ అసెంబ్లీలో ముగ్గురు బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పార్టీ టిక్కెట్లు కేటాయించింది. నలుగురు ఎంపీల్లో ముగ్గురు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కోరుట్ల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. కరీంగనగర్ ఎంపీ బండి సంజయ్ కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. బండి సంజయ్ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా కరీంనగర్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బండి సంజయ్ కరీంనగర్ నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు బోథ్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. ఈ ఎన్నికల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పోటీ చేసే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. మరో ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ కూడా ఈ ఎన్నికలకు దూరంగా ఉంటారని సమాచారం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ప్రచారం, పార్టీ ప్రచారంపై దృష్టి సారించనున్నారు.
BJP First List: బీజేపీ ఫస్ట్ లిస్ట్‌లో నేతలకు షాక్.. కనిపించని కిషన్ రెడ్డి పేరు..
Also Read
- Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్..!
- Bakrid Holiday Change: బక్రీద్ సెలవు మార్పు.. మే 28న జరగాల్సిన పరీక్షలు వాయిదా!
- Hyderabad: నెంబర్ ప్లేట్ లేని కారుతో ఢీ.. నగరంలో న్యాయవాది దారుణ హత్య!
- Telangana Heatwave: షాకింగ్.. తెలంగాణలో వడ దెబ్బతో 34 మంది మృతి.. ఈ 18 జిల్లాల ప్రజలు జాగ్రత్త!
తాజావార్తలు
-
Car Mileage Tips : ఫోన్ ఛార్జింగ్‌తో మైలేజ్ పడిపోతుందా? కార్లలో దాగిన అసలు సీక్రెట్ ఇదే.!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Raghav Chadha: రాఘవ్ చద్దాకు కీలక పదవి.. ప్రత్యేక బాధ్యతలు అప్పగించిన రాజ్యసభ ఛైర్మన్
-
NTV Exclusive: త్వరలోనే ‘మెగా పోడ్కాస్ట్’.. బాలయ్య ‘అన్‌స్టాపబుల్’ రైటర్‌తో చిరంజీవి బిగ్ ప్లాన్!
-
Allu Arjun – Venkatesh Iyer: ఐకాన్ స్టార్ ను కలిసిన వెంకటేశ్ అయ్యర్.. అల్లు అయాన్ కు స్పెషల్ గిఫ్ట్..!
ట్రెండింగ్
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!