Site icon NTV Telugu

Bike Robbery: రెచ్చిపోతున్న బైక్ దొంగ‌లు.. పార్కింగ్ వాహ‌నాలే టార్గెట్‌

Bike Robbery

Bike Robbery

పార్కింగ్ వాహనాలు చేసే వాహనాలే టార్గెట్‌. ఎక్క‌డైనా వాహనాలు పార్కింగ్ చేసి ప‌నుల‌కు లోప‌ల వెళ్ళి బ‌య‌ట‌కు వ‌చ్చి చూసేస‌రికి వాహ‌నదారులు కంగుతింటున్నారు. వారి బైక్ దొంగ‌త‌నానికి గురి కావడంతో ల‌బోదిబో మంటూ పోలీస్టేష‌న్ మొట్లు ఎక్కుతున్నాడు. న‌గ‌రంలోనే కాకుండా జిల్లాల వారిగా సీసీ కెమెరాలు వున్నా ఏమాత్రం జంక‌కుండా య‌దేశ్చ‌గా దొంగ‌త‌నం చేసేందుకు వెన‌కాడ‌టం లేదు బైక్ దొంగ‌లు. జిల్లాలో రోజు రోజుకు దొంగ‌త‌నాల‌కు పాల్ప‌డుతున్నారు. ఇలాంటి ఘ‌ట‌నే మహబూబాబాద్ జిల్లా లో చోటుచేసుకుంది.

జిల్లావ్యాప్తంగా బైక్ దొంగలు రెచ్చి పోతున్నారు. రోజుకు ఎదో ఒకచోట బైక్ ల చోరీకి పాల్ప‌డుతున్నారు. సురేష్ అనే వ్యక్తి .తన భార్య పోలీసు ఉద్యోగం కోసం కోచింగ్ కు మహబూబాబాద్ వచ్చాడు. మహబూబాబాద్ లోని ఏరియా ఆసుపత్రి ముందు ఇల్లు కిరాయి తీసుకొని ఉంటున్నారు. రాత్రి బైక్ పార్కు చేసిన సురేష్ రోజు మాదిరిగానే ఉదయం బ‌య‌ట‌కు వ‌చ్చి చూసే సరికి తన బైక్ మాయ‌మైంది. గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారని గ‌మ‌నించిన సురేష్ పోలీసులకు పిర్యాదు చేశానని, పోలీసులు చొరవ తీసుకొని తన బైక్ తనకు ఇప్పించాలని కోరారు.

కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు అక్క‌డున్న సీసీ ఫోటేజీని ప‌రిశీలించారు. ఏరియా ఆసుపత్రి ముందు రాత్రి పార్కు చేసిన బైక్ ను ఎంత సులువుగా ఎత్తుకెళుతున్నాడో సీసీ ఫోటేజీలో దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. దొంగ ముందుగా రెక్కీ నిర్వహించి, ఎవరు లేరని తెలుసుకొని బండి తనదే అన్నట్టు ఎంతో దర్జాగా తీసుకెల్లాడు. అంతే కాదు ఎదురుగా సీసీ కెమెరా ఉంది అని తెలిసినా నాకెందుకులే అనుకున్నాడే ఏమో ముఖానికి కట్ చీఫ్ కట్టుకొని మ‌రీ బైక్ తో పరార్ అయ్యాడు దుండ‌గులు. సీసీ కెమెరాలో రికార్డు అయినా దృష్యాల ఆధారంగా పోలీసులు బైక్ దొంగ‌ను ప‌ట్టుకునే ప‌నిలో ప‌డ్డారు.

Shahrukh Khan : బిగ్ స్క్రీన్ పై 30 ఏళ్ళ షారుఖ్ ఖాన్!

Exit mobile version