మునుగోడు ఉప ఎన్నికలు రాజకీయంగా హీట్ పుట్టిస్తున్నాయి.. సార్వత్రిక ఎన్నికలకు ముందు జరుగుతున్న ఉప ఎన్నిక కావడంతో ఇక్కడ గెలిచి రెట్టించిన ఉత్సాహంతో దూసుకెళ్లాలని అన్ని పార్టీలు భావిస్తున్నాయి. దీంతో మునుగోడు ఉప ఎన్నికకు ప్రాధాన్యం ఏర్పడింది. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ.. ఇలా ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.. ఉప ఎన్నికల్లో గెలిచి సత్తా చాటాలని భావిస్తున్నారు.. ఇతర పార్టీల నేతలను తమ వైపు తిప్పుకునేందుకు స్కెచ్‌లు వేస్తూనే ఉన్నారు.. తమ పార్టీలోకి రావలంటూ ఆహ్వానాలు పంపుతున్నాయి. తాజాగా, మునుగోడులో భారతీయ జనతా పార్టీకి షాక్ తగిలింది..
Read Also: Amit Shah and Jay Shah Viral Video: జైషాపై అమిత్‌షా సీరియస్.. ఇక్కడ దృష్టి పెట్టు..!
మర్రిగూడ మండలంలో బీజేపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది… కమలం పార్టీకి బైబై చెప్పిన ఆ పార్టీ మండల అధ్యక్షుడు, కార్యదర్శి… గులాబీ గూటికి చేరుకున్నారు.. టీఆర్ఎస్ పార్టీ కండువాలు కప్పి.. వారిని పార్టీలోకి ఆహ్వానించారు మంత్రి జగదీష్‌రెడ్డి… మర్రిగూడ మండల బీజేపీ అధ్యక్షుడు చెరుకు శ్రీరాములు, కార్యదర్శి మరియు సరంపేట ఉప సర్పంచ్ కొత్త మల్లయ్యలు తమ అనుచరులతో కలిసి గులాబీ గూటికి చేరారు. వారితో పాటే నాంపల్లి మండలం మహమ్మాదాపురం ఎంపీటీసీ మంజుల, గట్టుప్పల్ ఎంపీటీసీ చెరుపల్లి భాస్కర్ తదితరులు టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు.. ఇక, అదే బాటలో మహమ్మదాపేట ఎంపీటీసీ కూడా ఉన్నారని చెబుతున్నారు.. మొత్తంగా.. ఇతర పార్టీల నుంచి వచ్చేవారిని ఆర్షించే పనిలోపడిపోయారు నేతలు.. అన్ని పార్టీలోనూ అదే తంతు కొనసాగుతోందని.. వారికి పదువులు, పైసలు ఎరవేస్తున్నారని.. హోదాను బట్టి ఆఫర్లు ఇస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.. ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ రాకముందే.. మునుగోడులో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది.. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నేతలు, క్యాడర్.. మునుగోడులో తిష్టవేసి.. ప్రచారం చేసుకుంటున్నారు.