Ex MLA Son Case: మళ్లీ తెరపైకి మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడి కేసు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ex MLA Son Case: జూబ్లీహిల్స్ లోని మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడి కేసుని పోలీసులు మళ్లీ విచారణ చేపట్టారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 లో హిట్ అండ్ రన్ కేసు లో చిన్నారితో పాటు నలుగురికి గాయాలయ్యాయి. మార్చి 17 2022 లో రోడ్ నెంబర్ 45లో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం లో రోడ్డు దాటుతున్న 2 ఏళ్ల చిన్నారి పై ఓ కారు దూసుకెళ్లింది. ఢీ కొట్టిన కారు మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడి కారుగా గుర్తించారు పోలీసులు. షకీల్ కుమారుడి డ్రైవింగ్ వల్లే బాలుడు చనిపోయినట్లుగా ఆరోపణలు వచ్చాయి. మీర్జా ఇన్‌ఫ్రా పేరుతో కారు రిజిస్ట్రేషన్ అయినట్లు పోలీసులు గుర్తించారు.
అప్పటి పోలీసులు షకీల్ కుమారుడి పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చౌరస్తాలో బెలూన్స్ అమ్ముకొనే కుటుంబం పైకి దూసుకొని పోవడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో రెండేళ్ల చిన్నారి అక్కడికక్కడే మృతి చెందడమే కాకుండా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. తార్ కారుపై MLA షకీల్ పేరుతో స్టిక్కర్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తన కారు కాదని MLA స్టిక్కర్ ను తన స్నేహితుడికి ఇచ్చినట్లు అప్పట్లో చెప్పిన మాజీ ఎమ్మెల్యే షకీల్ వాదించాడు. ఆ కారు ప్రమాదంలో డ్రైవ్ చేసిన వ్యక్తిని కాకుండా మరొకరిపై జూబ్లీహిల్స్ పోలీసులు ఛార్జ్ షీట్ వేయడంతో ఈ వార్త అప్పట్లో సంచలనంగా మారింది.
Also Read
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
- Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
- CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
Read also: Premalu : దుమ్ముదులిపేస్తున్న ప్రేమలు మూవీ.. తెలుగులో కలెక్షన్స్ అన్ని కోట్లా?
మరో సారి ఈ కేసుపై దృష్టి పెట్టిన పోలీసులు దీనిప విచారణ చేపట్టారు. ఇప్పటికే బీఆర్ఎస్ బోధన్ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహైల్ రాజ్ భవన్ ప్రజా భవన్ వద్ద 2023లో డిసెంబర్ 24న అర్థరాత్రి కారుతో బీభత్సం సృష్టించిన కేసు నడుస్తోంది. పంజాగుట్ట ప్రజాభవన్ సమీపంలో ప్రమాదం జరగడంతో కానిస్టేబుళ్లు సోహైల్‌ను పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇంతలో మాజీ ఎమ్మెల్యే షకీల్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అయితే పోలీస్ స్టేషన్ లో ఏం జరిగిందో కానీ.. సోహైల్ కు బదులు షకీల్ ఇంట్లో ఉన్న పనిమనిషిని పోలీసులు కేసులో ఇరికించారు.
సీన్ కట్ చేస్తే ఎమ్మెల్యే కొడుకు విదేశాలకు ఎగిరిపోయాడు. ఈ కేసులో సీఐ, నైట్ డ్యూటీ ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్ల పాత్రపై పోలీసు అధికారులు విచారణ చేపట్టారు. రాత్రి కాల్స్‌లో సోహైల్‌తో మాట్లాడిన స్నేహితుల గురించి కూడా ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రేమ్ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Premalu : దుమ్ముదులిపేస్తున్న ప్రేమలు మూవీ.. తెలుగులో కలెక్షన్స్ అన్ని కోట్లా?
తాజావార్తలు
-
Kerala Assembly: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తొలగింపునకు కేరళ అసెంబ్లీ తీర్మానం.. అసలు కారణాలివే
-
Rupee vs Dollar: RBI 4 కీలక నిర్ణయాలు.. డాలర్‌తో పోలిస్తే 97 పైసలు బలపడిన రూపాయి!
-
CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
-
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
-
Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!