సినీ ఇండస్ట్రీలో మలయాళ సినిమాల ట్రెండ్ నడుస్తుంది.. మలయాళంలో చిన్న సినిమాగా విడుదలైన సినిమాలన్ని భారీ విజయాన్ని అందుకుంటున్నాయి.. తెలుగు డబ్ అవుతూ ఇక్కడ కూడా సెన్సేషనల్ హిట్ ను సొంతం చేసుకుంటున్నాయి.. ప్రేమలు సినిమా తెలుగు వర్షన్ సినిమా రికార్డులను బ్రేక్ చేస్తుంది.. కలెక్షన్స్ సునామి సృష్టిస్తుంది.. పది రోజులకు ఎన్ని కోట్లు రాబట్టిందో చూద్దాం..
తక్కువ బడ్జెట్ లో హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకేక్కింది.. కేరళ నుంచి సాఫ్ట్ వేర్ జాబ్ చేయడానికి హైదరాబాద్ కు వచ్చిన యువతి, యువకుల మధ్య ప్రేమ పుడితే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించారు.. క్యూట్ లవ్ స్టోరీగా వచ్చి ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద ప్రభంజనాన్ని సృష్టిస్తుంది.. తెలుగు యూత్ ను ఆకట్టుకుంటుంది.. కలెక్షన్స్ కూడా బాగానే రాబడుతుంది..
భారీ అంచనాలతో వచ్చి తెలుగు రాష్ట్రాల్లో కూడా ‘ప్రేమలు’ మూవీ భారీ స్థాయిలో రెస్పాన్స్‌ను దక్కించుకుంటోంది. తెలుగులో పది రోజులకు గానూ ఇప్పటివరకు 10.54 కోట్లను రాబట్టింది.. తెలుగులోవసూల్ చేసిన కలెక్షన్స్ వివరాలను తాజాగా మేకర్స్ విడుదల చేశారు.. ఇంకా ఈ సినిమా కలెక్షన్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.. ఇక ఈ సినిమాలో పుష్ప ఫేమ్ ఫహద్ ఫాజిల్ నిర్మించగా గిరీష్ ఏడి డైరెక్ట్ చేశాడు.మమితా బైజు,నస్లేన్,అల్తాఫ్ సలీం,మీనాక్షి రవీంద్రన్,అఖిల భార్గవన్ లీడ్ రోల్స్ లో నటించారు.విష్ణు విజయ్ సంగీతం అందించారు..