Site icon NTV Telugu

Telangana: పెండింగ్ ట్రాఫిక్ ఛలాన్‌లతో ఖజానాకు భారీ ఆదాయం

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఛలానాల క్లియరెన్స్ కొనసాగుతోంది. పెండింగ్ ఛలాన్‌ల కోసం తెలంగాణ పోలీస్ శాఖ ఇచ్చిన రాయితీలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. దీంతో మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరింది. సుమారు 1.2 కోట్ల పెండింగ్ ఛలానాల ద్వారా రూ.112.98 కోట్లు జమ అయ్యాయి.

హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటి వరకు 63 లక్షల ఛలాన్‌లు క్లియర్ కాగా.. వీటి ద్వారా రూ.49.6 కోట్లు వాహనదారులు చెల్లించారు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 38 లక్షల ఛలాన్‌లు క్లియర్ కాగా వీటి ద్వారా రూ.45.8 కోట్లు ఆదాయం వచ్చింది. రాచకొండ కమినరేట్ పరిధిలో 16 లక్షల ఛలాన్‌లు క్లియర్ కాగా రూ.15.3 కోట్ల ఆదాయం లభించింది. కాగా ట్రాఫిక్ పోలీస్ శాఖ ఇచ్చిన రాయితీలు ఈనెల 31 వరకు కొనసాగనున్నాయి. మీరు కూడా మీ వాహనానికి ఛలానా ఉంటే ఇప్పుడే ఆన్‌లైన్ ద్వారా రాయితీ పొంది చెల్లించేయండి.

https://ntvtelugu.com/kaleshwaram-godavari-water-reached-to-yadagirigutta/
Exit mobile version