Bhatti vikramarka: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కోదండరామస్వామి ఆలయంలో జరిగిన సీతారాముల వారి కల్యాణంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఆలయంలో స్వామివారికి భట్టి విక్రమార్క ప్రత్యేక పూజలు చేశారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు ఆలయ చైర్మన్ రేణిగుంట్ల శ్రీనివాస్, ధర్మకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఆలయ పండితులు ఆశీర్వచనం అందించారు. ఇవాళ శ్రీరామ నవమి సందర్భంగా పీపుల్స్ మార్చ్ కు విరామం ఇచ్చారు. రాత్రి బెల్లంపల్లిలో బస చేయనున్నారు. అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజావాఖ్య పరిపాలన చేసిన రాముడిని నేటి పాలకులు ఆదర్శవంతంగా తీసుకోవాలని అన్నారు. ప్రజల అభీష్టం మేరకే ప్రజాస్వామ్య పరిపాలన ఉండాలని కోరారు. ప్రస్తుతం ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాలన ప్రజాభిష్టం మేరకు లేకపోవడం దురదృష్టకరమన్నారు. లౌకిక, సామ్యవాద ప్రగతిశీల పరిపాలనే ఈ దేశానికి శ్రేయస్కరమని భట్టి పేర్కొన్నారు.
Read also: World Biggest Snake: ప్రపంచంలోనే అతిపెద్ద పాము.. వీడియో చూస్తే వణికిపోవడం పక్కా
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రామచంద్రాపురం గ్రామంలో రాములోరి కళ్యాణం పోలీస్ పహరలో కొనసాగింది. వీ.ఎం.బంజర్ పోలీస్ స్టేషన్ నుండి పోలీసులు తలంబ్రాలు తీసుకొచ్చారు. సీతారాములు కళ్యాణానికి ముందుగా వీ.ఎం.బంజర్ ఎస్సై సూరజ్ తలంబ్రాలు పోశారు. రామచంద్రాపురం గ్రామంలో తలంబ్రాలు ముందుగా పోయ్యాలని ఇరు వర్గాల మద్య నడుస్తున్న గొడవలు ఎస్సై పుల్‌స్టాప్ చేశారు. ఇరువర్గాల మద్య సయోద్య కుదరకపోవటంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి, సత్తుపల్లి రూరల్ సిఐ,వీ.ఎం.బంజర్ ఎస్సై అద్వర్యంలో భారీ బందోబస్త్ నడుమ రాములోరి కాళ్యాణం నిర్వహించారు. దీంతో పోలీసులు మీకు మా సెల్యూట్ అంటున్నారు స్థానికులు.
YS Jagan Meets Nirmala Sitharaman: నిర్మలా సీతారామన్‌తో సీఎం జగన్ కీలక చర్చలు.. వీటిపైనే ఫోకస్..!