Site icon NTV Telugu

Bhatti Vikramarka : పనుల్లో వేగం, నాణ్యత, స్పష్టతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి

Bhatti

Bhatti

Bhatti Vikramarka : ప్రజా భవన్‌లో ఏర్పాటు చేసిన ‘తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ వార్ రూమ్’ ను మంగళవారం డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు సందర్శించారు. రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధికి రోడ్‌మ్యాప్‌ రూపుదిద్దుకునే ఈ కీలక కేంద్రంలో జరుగుతున్న కార్యక్రమాలను ఆయన సమగ్రంగా పరిశీలించారు. విజన్ డాక్యుమెంట్ రూపకల్పన పురోగతితో పాటు ఈ నెల 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై భట్టి విక్రమార్క వివరంగా చర్చించారు.

Trump House: అమ్మకానికి అమెరికా అధ్యక్షుడి ఇల్లు.. విలువ ఎంతో తెలుసా!

సమ్మిట్ విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాటైన పలు కమిటీల పనితీరు, బాధ్యతలు, ఇప్పటి వరకు పూర్తయిన వర్క్ ఫ్లోపై అధికారులతో సమీక్షించారు. ఇన్విటేషన్, హాస్పిటాలిటీ, వేదిక, లాజిస్టిక్స్, ట్రాన్స్‌పోర్ట్, ప్రోగ్రామ్ నిర్వహణ, కల్చరల్ ఈవెంట్స్, కమ్యూనికేషన్, డిజిటల్ మీడియా కమ్యూనికేషన్ వంటి కీలక విభాగాల కమిటీ అధ్యక్షులు, టీమ్ సభ్యులతో ప్రత్యేక భేటీలు నిర్వహించిన డిప్యూటీ సీఎం, ప్రతి విభాగంలో జరుగుతున్న పనిని విడివిడిగా సమీక్షించారు.

సమీక్ష తర్వాత వార్ రూమ్‌లో పనిచేస్తున్న ప్రతి బృంద సభ్యుల వద్దకు స్వయంగా వెళ్లి, జరుగుతున్న పనితీరు, అందుబాటులో ఉన్న సౌకర్యాలు, వసతి ఏర్పాట్లు వంటి విషయాలను వ్యక్తిగతంగా అడిగి తెలుసుకున్నారు. పనుల్లో వేగం, నాణ్యత, స్పష్టతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆయన ఆదేశించారు. డిప్యూటీ సీఎం భట్టి గత కొన్ని రోజులుగా వరుసగా వార్ రూమ్‌కు వచ్చి, విజన్ డాక్యుమెంట్ రూపకల్పనపై విచారణలు, సమీక్షలు నిర్వహిస్తున్నారు. రేపటి నుంచే రాష్ట్ర మంత్రులూ వార్ రూమ్‌ను సందర్శించి జరుగుతున్న పనులను పర్యవేక్షించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

Rameshwaram Cafe: ఎంతకు తెగించార్రా.. రామేశ్వరం కేఫ్‌పై కేసు..

Exit mobile version