Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Bhatti Vikramarka To Take Oath As Deputy Cm

Bhatti Vikramarka: సీఎం రేసులో వున్న.. కానీ డిప్యూటీ సీఎంతో సరిపెట్టకున్న భట్టి..

Published Date :December 7, 2023 , 12:52 pm
By Bhanu
Bhatti Vikramarka: సీఎం రేసులో వున్న.. కానీ డిప్యూటీ సీఎంతో సరిపెట్టకున్న భట్టి..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Bhatti Vikramarka: తెలంగాణ ముఖ్యమంత్రి పదవి కోసం చివరి నిమిషం వరకు పోరాడిన భట్టి విక్రమార్క ఎట్టకేలకు డిప్యూటీ సీఎంతో సెటిల్ అయ్యారు. అయితే ఇద్దరు డిప్యూటీ సీఎంల ప్రతిపాదనకు ఆయన సుముఖత వ్యక్తం చేయకపోవడంతో ఎట్టకేలకు భట్టికి ఆ పదవి దక్కనుంది. తెలంగాణ సీఎం రేసులో భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ చివరి నిమిషం వరకు ప్రయత్నాలు చేశారు. చివరకు రేవంత్‌పై అధిష్టానం మొగ్గుచూపడంతో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. మధిర ఎమ్మెల్యే మల్లు విక్రమార్క తాజాగా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ప్రమాణస్వీకారోత్సవంలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర 2వ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన సమయంలోనే మధిర ఎమ్మెల్యే విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ పరిణామం తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఖమ్మం జిల్లాకు అరుదైన గౌరవాన్ని తెచ్చిపెట్టింది.

Read also: Komatireddy: మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న కోమటి రెడ్డి

ప్రస్తుతం ఆయన ఖమ్మం జిల్లా మధిర అసెంబ్లీ నియోజకవర్గానికి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున నాలుగోసారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. భట్టి 2009, 2014, 2018 మరియు 2023 ఎన్నికలలో శాసనసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. 2009 నుంచి 2011 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్‌గా.. 2011 నుంచి 2014 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. 2019 నుంచి 2023 వరకు తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా పనిచేశారు. మల్లు భట్టి విక్రమార్క 2023 మార్చి 16న ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ నియోజకవర్గంలోని పిప్పిరి గ్రామం నుంచి ప్రారంభమైన ‘పీపుల్స్ మార్చ్’ రాష్ట్రంలోని 17 జిల్లాలు, 36 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 1,365 కిలోమీటర్ల మేర పూర్తి చేసింది. జూలై 2న రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా 23 జన గర్జన సభ జరిగింది. తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గంలో ఖమ్మం జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రితో పాటు మరో ఇద్దరికి మంత్రి పదవులు దక్కనున్నాయి. ఖమ్మం నుంచి గెలుపొందిన సీనియర్‌ నేత తుమ్మల నాగేశ్వరరావుతో పాటు పాలేరు ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మొత్తం 10 నియోజకవర్గాలకు గాను 9 చోట్ల గెలిచిన ఉమ్మడి ఖమ్మం జిల్లాకు మొత్తం మూడు స్థానాలు దక్కడం విశేషం.
Telangana Speaker: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bhatti vikramarka
  • Bhatti Vikramarka to take oath as Deputy CM
  • Chife minister Revanth reddy
  • CM Revanth Reddy
  • Deputy CM Bhatti Vikramarka

తాజావార్తలు

  • Off The Record : బీఆర్ఎస్ వెంటే ఉండాలని మహిపాల్ రెడ్డి డిసైడ్ అయ్యారా?

  • RR vs CSK : రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం.. వైభవ్ సూర్యవంశీ ‘సిక్సర్ల’ సునామీ.!

  • Gas Cylinder Scam : కొరత పేరుతో కుంభకోణం.. శ్మశానంలోనే సిలిండర్ సీక్రెట్.!

  • Big Relief: యుద్ధం వేళ కేంద్రం బిగ్ రిలీఫ్.. 6 నెలల పాటు EMI కట్టక్కర్లేదు..?!

  • Off The Record: ఆళ్లగడ్డ అడ్డాలో బస్తీ మే సవాల్.. సుబ్బారెడ్డి, అఖిల ప్రియ మధ్య రచ్చ

ట్రెండింగ్‌

  • Anand Mahindra: 1000 ఏళ్ల నాటి మెట్ల బావి.. టెక్నాలజీకి ఫిదా అయిపోయిన ఆనంద్ మహీంద్రా..

  • Ragi Boorelu Recipe : పిల్లలకి కూడా నచ్చే హెల్తీ స్వీట్.. రుచికరమైన రాగి పూర్ణం బూరెలు.!

  • Cheruku Rasam : చెరుకు రసం తాగుతున్నారా.. ఈ విషయం తెలుసుకున్నారా మరి..!

  • Human Saliva: మన ఉమ్మిలో ఉన్న పవర్ ఫుల్ పదార్థం గురించి మీకు తెలుసా?

  • Honey Tea Benefits : టీ + తేనె = ఆరోగ్యం..? కానీ ఈ తప్పు చేస్తే ప్రమాదం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions