NTV Telugu Site icon

Bhatti Vikramarka: కొనసాగుతున్న భట్టి విక్రమార్క పాదయాత్ర.. ఆదివాసీల సమస్యలపై..

Bhatti Vikramarka

Bhatti Vikramarka

Bhatti Vikramarka: ఆదిలాబాద్ జిల్లాలో కొనసాగుతున్న భట్టి విక్రమార్క పాదయాత్ర.. ఇవాల దస్నాగూడ రైతులతో చర్చించుకుంటూ ముందుకు సాగుతున్నారు. సాగునీరు అందక జొన్న చేను ఎండిపోతుందని జొన్న కంకులు తీసుకువచ్చి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చూపించి గంగాధర్ అనే రైతు ఆవేదన వ్యక్తం చేశారు. చికుమాక్ ప్రాజెక్టు ఎత్తు పెంచితే తమకు సాగునీరు అందుతుందని రైతు గంగాధర్ భట్టి వివరించారు. చికుమాను ప్రాజెక్టు గురించి అసెంబ్లీలో మాట్లాడాలని రైతులు కోరారు. రైతు మాటలకు స్పందించిన భట్టి పెండింగ్ సాగునీటి ప్రాజెక్టుల గురించి తప్పనిసరిగా అసెంబ్లీలో రైతుల గొంతుకగా మాట్లాడుతానని హామీ ఇచ్చారు. అనంతరం ఇంద్రవెల్లి మండలం పిట్ట బొంగరం వద్దకు భట్టి విక్రమార్క పాదయాత్ర చేరుకుంది. పిట్ట బొంగరంలో ఆదివాసీల సమస్యలు తెలుసుకుంటూ భట్టి విక్రమార్క ముందుకు సాగుతుంది.

Read also: Tooth Decay : దంతాలు పుచ్చి పోతున్నాయా.. వీటిని ట్రై చేయండి..

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపడుతున్న పాదయాత్రకు సంఘీభావం తెలిపి మద్దతు ప్రకటించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. నిన్న సిరికొండ మండల కేంద్రంలో భట్టి విక్రమార్క తో కలిసి పాదయాత్రలో నడిచారు. అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఐటీడీఏ పరిధిలోని గిరిజన ప్రజలకు ఇండ్లు, పోడు పట్టాలు, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలు వర్తింపజేసి ఉపాధి హామీ పని కల్పించామని గుర్తుచేశారు. కాగా..తెలంగాణ వస్తే మరిన్ని మంచి పథకాలు వస్తాయని ఆశించిన ప్రజలకు ఉన్న పథకాలు తీసివేసి ప్రజలను గోసపెడుతున్న వ్యక్తి కేసిఆర్ అన్నారు. ఇక.. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల గురించి అనేక మాయమాటలు చెప్పిన సీఎం కేసీఆర్ హౌజింగ్ శాఖను ఎత్తివేసి ప్రజలను దగా చేశారంటూ నిప్పులు చెరిగారు.
Swapnalok Fire Accident: స్వప్నలోక్‌లో అగ్నిప్రమాదానికి కారణమిదే.. తేల్చిన అధికారులు